మహానటి బయోపిక్ లో కీర్తి సురేష్ కి సావిత్రి పాత్ర చేసే అవకాశం వచ్చినప్పుడు ఆమె ముందు కేవలం రెండే ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి తనదైన శైలిలో నటించడం.. లేదా సావిత్రి నటనా అభినయాన్ని కాపీ కొట్టడం. నిజానికి బయోపిక్ అంటే ఒక వ్యక్తిని అనుకరించి చేయడమే. స్కామ్ 1992లో హర్షద్ మెహతా పాత్రలో ప్రదీప్ గాంధీ నటనకు అందరూ ఫిదా అయ్యారంటే అతిశయోక్తి కాదు. స్క్రీన్ పై కనిపించని వారి పాత్రలో కీర్తి సురేష్ నటింపజేసే ఆమె కచ్చితంగా ఫెయిలై ఉండేదనేది చాలా మంది అభిప్రాయం.
అయితే అత్యుత్తమ నటి సావిత్రి ని అభినయించడం కూడా మామూలు విషయం ఏమీ కాదు. కానీ కీర్తి సురేష్ ఆ విషయంలో దాదాపు ఫెయిల్ అయ్యారనే చెప్పాలి. సావిత్రి నటన చూసి కీర్తి సురేష్ నటన చూస్తే.. కీర్తి నటన ఎంత పేలవంగా ఉందో స్పష్టమవుతుంది. ఆమెలో నటనా టాలెంట్ కంటే ఎక్కువగా కృషి ఉందని చెప్పుకోవచ్చు. ఆమె పాత్రను మేకప్ మ్యాన్.. డైరెక్టర్ చాలా చక్కగా తీర్చిదిద్దారు. పాటలు, కథాబలం, డైలాగులు ఇలా ప్రతి ఒక్కటి సినిమా కి మంచి పేరు తెచ్చిపెట్టాయి. సావిత్రి పాత్రలో కీర్తి పరకాయ ప్రవేశం చేశారని చెప్పడం కూడా అతిశయోక్తే అవుతుంది. సావిత్రి లాంటి అద్భుతమైన నటీమణి ఇప్పటి కాలంలో ఉన్నట్లయితే ఆస్కార్ లెవెల్ లో అవార్డులు వచ్చి ఉండేవి. కాస్త అందం, కాస్త నటన, మంచి కథలను ఎంచుకునే తెలివి ఉంటే చాలు కోట్ల రూపాయల పారితోషికం పుచ్చుకోవచ్చనే నిజం ప్రస్తుతం చాలామంది హీరోయిన్లలో రుజువవుతోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి