ఇటీవల కాలంలో డబ్ స్మాష్, ప్రాంక్ వీడియోస్ సోషల్ మీడియాలో ట్రెండ్‌గా మారిన సంగతి అందరికీ విదితమే. ఈ క్రమంలోనే సెలబ్రిటీలందరూ పలు సాంగ్స్, సూపర్ హిట్ సీన్స్‌లో నటిస్తూ తమ సోషల్ మీడియా అకౌంట్స్ వేదికగా షేర్ చేస్తున్నారు. తాజాగా యాంకర్ శ్రీముఖి ఇన్ స్టా వేదికగా డిఫరెంట్ వీడియో షేర్ చేయగా, నెట్టింట అది వైరలవుతోంది. ఇంతకీ అందులో ఏముందంటే.. యాంకర్ శ్రీముఖి, ‘జబర్దస్త్’ స్టార్ ముక్కు అవినాశ్ భార్యా భర్తలుగా నటించారు. ఇన్ స్టా రీల్స్‌లో ఈ వీడియో షేర్ అయింది. మధ్య తరగతి కుటుంబ బంధాలు ఇలానే ఉంటాయంటూ ‘కార్తీక దీపం’ సీరియల్‌లోని డాక్టర్ బాబు -వంటలక్క సీన్‌ను రిపీట్ చేశారు.

స్కిట్ మాదిరిగా ఉన్న ఈ వీడియోలో ఆరోగ్యం గురించి ఆలోచించని భార్యపై తన హక్కుగా భర్త చేయి చేసుకున్న మాదిరిగా శ్రీముఖిని ముక్కు అవినాశ్ లాగి కొడతాడు. చివరికి ఇద్దరు ఒక్కటై కనబడతారు. మొత్తంగా శ్రీముఖి, ముక్కు అవినాష్ ఇన్ స్టా రీల్స్ వీడియోకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. ‘శ్రీముఖి యాక్టింగ్ చాలా బాగుందంటూ’ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తుండగా, ‘ఇద్దరూ కలిసి ఇరగదీశారు’ అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా శ్రీ‌ముఖి, అవినాష్ ఇద్ద‌రూ ఒక‌రికొక‌రు త‌మ నటనా చాతుర్యాన్ని ఈ స్కిట్ రూపంలో ప్రదర్శించినట్లు అర్థమవుతున్నది.

 ఇకపోతే డాక్టర్ బాబు వంటలక్క విడిపోవద్దని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఆదరించిన ‘కార్తీక దీపం’ సీరియల్‌లోని సీక్వెన్స్ చేయడం ద్వారా తమకు ఇంకా పాపులారిటీ రావడంతో పాటు మంచి వ్యూస్ వస్తాయని ఈ వీడియోలో శ్రీముఖి, అవినాష్ నటించినట్లు తెలుస్తోంది. ఇకపోతే కార్తీక దీపం ఒరిజినల్ సీరియల్ కూడా జనాలను విశేషంగా ఆకట్టకుంటున్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వంటలక్కగా ప్రేమి విశ్వనాథ్,  డాక్టర్ బాబుగా నిరుపమ్ పరిటాల సీరియల్‌లో ఇరగదీస్తున్నారు.  తాజాగా శ్రీముఖి హీరోయిన్‌గా నటించిన ‘క్రేజీ అంకుల్స్’ ఫిల్మ్ ఇటీవల విడుదలైన సంగతి అందరికీ విదితమే.

మరింత సమాచారం తెలుసుకోండి: