టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ సమంత.. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు పది సంవత్సరాలు అవుతున్న కానీ సామ్ హవా మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పటికి టాప్ వన్ హీరోయిన్ స్థానంలోనే ఉంది. ఏమాయ చేసావో సినిమాతో తన సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన సామ్ ఎంతో మంది హీరోలతో ఎన్నో సినిమాల్లో నటించింది. అక్కినేని నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి అయినాగానీ సినిమాలు చేస్తూ లైఫ్ ను లీడ్ చేస్తూ వస్తుంది.అలాగే రీసెంట్ గా  డిజిటల్ ప్లాట్ ఫాం లో అడుగుపెట్టడంతో పాటు ఫ్యామిలీ మాన్ సినిమాలో  డీ గ్లామరస్ పాత్రను పోషించి అందరి చేత శభాష్ అనిపించుకుంది. అయితే ఇప్పుడు సమంతకు సంబందించిన న్యూస్ ఒకటి వైరల్ గా మారింది. అక్కినేని సమంతగా మారిన సామ్ ఈ మధ్య తన సోషల్ మీడియా ఖాతాలో అక్కినేని అనే ఇంటి పేరుకు బదులుగా ఎస్ అనే అక్షరాన్ని మార్చుకోవడం పట్ల అందరిలో ఆసక్తి రేకింది.

సామ్ ప్రస్తుతం నటిస్తున్న శాకుంతలం సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇలా పేరు మార్చిందా అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన సమంత అలా పేరు ఎందుకు మార్చాను అనే దానిపై అయితే పూర్తి వివరణ అయితే ఇవ్వలేదు కానీ తాను కొంతకాలం పాటు సినిమాలకు బ్రేక్ తీసుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.నేను ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు అవుతున్నది. ఇప్పటి దాక విరామం లేకుండా సినిమాలు చేస్తూనే వచ్చాను.

ఇకమీదట అయిన సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చి ఫ్యామిలీతో గడపాలని అనుకుంటున్న అని సమాధానం చెప్పింది. సామ్ చెప్పిన విషయం పట్ల రకరకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కరోనా వైరస్ కారణంగా ఒక పక్క సినిమాలు లేక ఏడాదిన్నర పాటు ఇంట్లోనే అందరు ఫ్యామిలీతో ఉన్న విషయం మనకి తెలిసిందే. మళ్ళీ కొత్తగా సామ్ ఏంటి ఇలా అంటుంది అన్న ప్రశ్న అందరిలో మెదులుతుంది. ఒకవేళ సమంత ఏమైనా గుడ్ న్యూస్ చెప్పబోతుందా.అందుకే విరామం తీసుకోనున్నట్లు చెప్తుందా అనే ఆలోచన అందరిలో ఉంది. లేదంతె సోషల్ ఖాతాలో ఎస్ అనే పేరుకు ఈ నిర్ణయానికి ఎమన్నా రిలేషన్ ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వీటన్నిటికీ సమంతనే సమాధానం చెప్పాలి.. లేదంటే ఈ ప్రశ్నలకు జవాబులు దొరకడం కష్టం. 

మరింత సమాచారం తెలుసుకోండి: