ఇక ఇందులో నాగేశ్వరరావు, శ్రీదేవి ఇద్దరు ప్రేమించుకోవడం, కానీ అప్పటికే నాగేశ్వరరావు కి క్యాన్సర్ ఉందన్న విషయం తెలియక శ్రీదేవి పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతుంది.కాకపోతే శ్రీదేవి సోదరుడికి నాగేశ్వరరావుకు క్యాన్సర్ అని తెలియడంతో వీళ్ళ పెళ్లిని ఆపివేయాలని ప్లాన్ చేస్తాడుకానీ శ్రీదేవి ,నాగేశ్వరావు దొంగతనంగా పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. కానీ శ్రీదేవి తమ్ముడు ఎలాగైనా సరే పెళ్లిని ఆపాలని, ఒక వేశ్య ను తీసుకొచ్చి నాగేశ్వరరావు తో చాలా క్లోజ్ గా మూవ్ అయ్యే టట్లు చేస్తాడు. ఆమె ఎవరో కాదు మన సూపర్ స్టార్ హీరోయిన్ జయసుధ. తనను పెళ్లి చేసుకోమని కోరడంతో అక్కినేని నాగేశ్వరావు జయసుధ ని పెళ్లి చేసుకుంటాడు. ఇక పూర్తిగా నిజం తెలుసుకున్న శ్రీదేవి అక్కడికి వచ్చే లోపే వీరిద్దరి పెళ్లి జరిగిపోయింది.. జరిగిన తప్పును తెలుసుకుంటుంది శ్రీదేవి..
ఇలా ఈ కథ ఎంతో అద్భుతంగా సాగింది అని చెప్పవచ్చు. ఎన్నో మలుపులు.. ప్రేమానురాగాలు, అనుబంధాలు ఇలా ప్రతి ఒక్కటి కళ్ళకు కట్టినట్లు చూపించారు దాసరి నారాయణరావు.. అందుకే ఈ సినిమా అప్పట్లోనే అంత వసూలు చేసి ఇండస్ట్రీలో ఉన్న రికార్డు తిరగరాసింది. ఇక ఇప్పట్లో అయితే వందల కోట్ల రూపాయలను వసూలు చేసి ఉండేదేమో.. ఏది ఏమైనా ప్రేమకు చక్కగా నిర్వచనాన్ని చూపించారు దాసరి నారాయణరావు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి