పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఎక్కువగా పుస్తకపఠనం చేస్తుంటారు. తనలాగా పుస్తకాలను బాగా ఇష్టపడే విజ్ఞాన సంపన్నులను పవన్ బాగా ఇష్టపడుతుంటారు. తాను చదువుకున్న పుస్తకాల గురించి ఎక్కువ డిస్కస్ చేయడానికే ఆసక్తి చూపుతుంటారు. అందుకే తన ఫ్రెండ్స్ కూడా తన లాగా పుస్తక ప్రియులై ఉండాలని పవన్ భావిస్తుంటారు. ఆ విధంగానే ఆయన తన ప్రాణ స్నేహితులను కూడా ఏర్పరుచుకున్నారు. అంతేకాకుండా సినిమా ఇండస్ట్రీలో సైతం అతనికి ప్రాణ మిత్రులు ఉన్నారు. వారెవరో ఇప్పుడు చూద్దాం.
1. ఆనంద్ సాయి
ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి తొలిప్రేమ, తమ్ముడు, జల్సా వంటి సినిమాలకు పని చేశారు. తెలంగాణలోని భువనగిరి సమీపంలోని యాదాద్రి దేవాలయమైన లక్ష్మీ నరసింహ దేవాలయానికి ఆయన ప్రధాన వాస్తుశిల్పిగా వ్యవహరించారు. తొలిప్రేమ చిత్రంలో పవన్ కి సోదరి మణి గా నటించిన వాసుకి ని అతని పెళ్లి చేసుకున్నారు. పవన్ చిత్రాలతోనే ఆనంద్ సాయి ఇండస్ట్రీలో అరంగేట్రం చేశారు. అయితే వీరిద్దరి మధ్య మంచి స్నేహం కుదిరింది. ఇప్పటికీ వీరు ప్రాణ మిత్రులుగా మెలుగుతున్నారు.
2. శరత్ మారార్
పవన్ హీరోగా నటించిన గబ్బర్ సింగ్, కాటమరాయుడు సినిమాలకు నిర్మాతగా శరత్ మారార్ వ్యవహరించారు. ఈ నేపథ్యంలోనే పవన్, శరత్ మధ్య మంచి స్నేహం ఏర్పడింది.
3. మహేష్ బాబు:
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, పవన్ కల్యాణ్ ఎంత మంచి స్నేహితులో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. జల్సా సినిమాకి మహేష్ వాయిస్ ఓవర్ అందించి తన స్నేహాన్ని మరింత దృఢపరచుకున్నారు.
4. నర్రా శ్రీనివాస్:
పవన్ కల్యాణ్ కి తన పర్సనల్ అసిస్టెంట్ నర్రా శ్రీనివాస్ అంటే చాలా ఇష్టం. వీళ్ళిద్దరూ మంచి స్నేహితులు కూడా.
ఇకపోతే అలీ, వెంకటేష్, రేణు దేశాయ్, జనసేన పార్టీ నాయకుడు రాజు రవి రాజా, దర్శకుడు త్రివిక్రమ్ కూడా పవన్ కల్యాణ్ కు మంచి స్నేహితులు ఉన్నారు. వీరిలో అలీ కొన్ని మనస్పర్థల కారణంగా పవన్ కి దూరం అయినట్టు తెలుస్తోంది. ఇక రేణుదేశాయ్ పవన్ కి విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి