హైపర్ ఆది..  జబర్దస్త్ అనే కార్యక్రమంలో ఒక సాదా సీదా కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన హైపర్ ఆది ప్రస్తుతం ఏకంగా జబర్దస్త్ కార్యక్రమం లోనే టాప్ టీం లీడర్ గా కొనసాగుతున్నాడు.  ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమం వస్తుంది అంటే కేవలం హైపర్ ఆది స్కిట్ మాత్రమే చూడటానికి చాలా మంది ఆసక్తి చూపుతారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇలా  జబర్దస్త్ లో కమెడియన్గా మాత్రమే కాదు ఇక ఈ టీవీ లో ప్రస్తుతం ప్రసారమవుతున్న అన్ని కార్యక్రమాలకు కూడా రైటర్ గా పని చేస్తున్నాడు. ఇక సినిమాలకు కూడా స్టోరీలు రాస్తూ తెగ బిజీ అయిపోయాడు హైపర్ ఆది.  ఇక ఎన్నో సినిమాల్లో కీలక పాత్రల్లో కూడా అవకాశాలు దక్కించుకుంటున్నాడు.



 అయితే హైపర్ ఆది అసలు జబర్దస్త్ లోకి రావడానికి అటు అదిరే అభి కారణం అనే విషయం తెలిసిందే.  ఎక్కడో ఒక సాఫ్ట్ వేర్ జాబ్ చేసుకుంటూ ఉన్న హైపర్ ఆది ని ఒక చిన్న స్కిట్ చూసి జబర్దస్త్ లోకి పిలిపించాడు అదిరే అభి.  ఆ తర్వాత అవకాశాల మీద అవకాశాలు ఇస్తూ ఆది హైపర్ ఆది గా ఫేమస్ కావడానికి అదిరే అభి కారణం అయ్యాడు.  అందుకే అదిరే అభి కనిపించినప్పుడల్లా ఇక నేను ఈ స్థాయికి ఎదిగాను అంటే దానికి అభి అన్న కారణం అంటూ హైపర్ ఆది నిర్మొహమాటంగా చెబుతూ ఉంటాడు.  ఇక అభి అన్నకు గురుదక్షిణగా ఏమి ఇచ్చినా తక్కువే అంటూ తన గురువు మీద తనకున్న గౌరవాన్ని చాటుకుంటూ ఉంటారు హైపర్ ఆది.



 ఇకపోతే ఇటీవల ఏకంగా స్టేజి మీదే అదిరే అభి కాళ్లు పట్టుకున్నాడు హైపర్ ఆది.  ఎప్పుడూ సరికొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకులను అలరించే శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం ఇటీవలే ఆచార్య దేవోభవ అనే ఒక సరికొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు.  ఈ క్రమంలోనే ఇక జబర్దస్త్ లో సీనియర్ టీమ్ లీడర్గా ఉన్న అదిరే అభి, చలాకి చంటి లాంటి టీం లీడర్లు స్టేజిపై నిలబడగా.. తాను ఈ పొజిషన్ లో ఉన్నాను అంటే అదిరే అభి అన్న కారణమని..  అభి అన్న లేకపోతే అసలు హైపర్ ఆది లేడని.. అభి అన్న నాకు దేవుడితో సమానమని అంతకంటే ఏం చెప్పలేను అంటూ ఏకంగా స్టేజీపైన అదిరే అభి కాళ్లు పట్టుకున్నాడు హైపర్ ఆది. హైపర్ ఆదికి గురువుపై  ఉన్న అభిమానానికి అందరూ ఫిదా అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: