ప్రేమ అనేది ఒక వ్యక్తి జీవితంలో ఎప్పుడు పుడుతుందో ఎప్పుడు అంతం అవుతుందో ఎవ్వరికి తెలీదు.
ఈ విధంగా ఎంతోమంది ప్రేమలోపడి ఆ ప్రేమ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసి, పెద్దల సమక్షంలో ఎంతో అంగరంగ వైభవంగా నిశ్చితార్థం జరుపుకొని కొన్ని జంటలు పెళ్లి పీటల వరకు వెళ్ళి ఆగిపోయిన పెళ్లిళ్లు ఎన్నో ఉన్నాయని సమాచారం. అయితే ఈ విధంగా ఆగిపోయిన పెళ్లిళ్లలో సాధారణ వ్యక్తులు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు కూడా ఎంతోమంది ఉన్నారట . మరి వీరిలో ముఖ్యంగా అఖిల్ అక్కినేని పెళ్లి కూడా ఇదే కోవకు చెందినదే అని తెలుస్తుంది.

 అఖిల్ శ్రీయ భూపాల్ అనే ప్రముఖ ఫ్యాషన్ మరియు కాస్ట్యూమ్ డిజైనర్ ప్రేమించారట. వీరి ప్రేమ పెద్దలను ఒప్పించి పెళ్లి వైపు అడుగులు వేసేలా చేసిందట . ఈ క్రమంలోనే అఖిల్ శ్రీయ భూపాల్ నిశ్చితార్థ వేడుకలను ఎంతో అంగరంగవైభవంగా జరిపించారని తెలుస్తుంది. వీరివి నిశ్చితార్థ సమయంలో ఎంతో ఆనందంగా కనిపించిన ఈ జంట ఆ తర్వాత పలు కారణాల చేత వీరి పెళ్లి ఆగిపోవాల్సి వచ్చిందట . అయితే వీరీ పెళ్లి ఆగిపోవడానికి సరైన కారణం ఇప్పటికీ తెలియనప్పటికీ, అఖిల్ తొందరపాటు నాగార్జునకు నచ్చలేదని సమాచారం.అందుకోసమే ఈ పెళ్లి పెటాకులైందంటూ అప్పట్లో వార్తలు వచ్చాయట . అలాగే అఖిల్ మధ్య బేధాభిప్రాయాలు రావడం వల్ల వీరు విడిపోయినట్లు కూడా వార్తలు వచ్చాయని సమాచారం.

ఇలా పెళ్లి వరకు వెళ్లి వీరి పెళ్లి ఆగిపోవడంతో తన కెరియర్ పై దృష్టి పెట్టి సినిమా అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే శ్రేయ భూపాల్ మాత్రం 2018లో తాను ప్రేమించిన ఆనిందిత్ రెడ్డి అనే ఒక ఎన్నారైను పెళ్లి చేసుకుని తన వైవాహిక జీవితాన్ని ఎంతో ఆనందంగా గడుపుతున్నారు. శ్రియా భూపాల్ హైదరాబాద్లోని ప్రముఖ వ్యాపారవేత్త అయిన జీవీకే రెడ్డి మనవరాలు అనే సంగతి మనకు తెలిసిందే. ఫ్యాషన్ పై ఇష్టం ఉండటంచేత శ్రియ ఫ్యాషన్ రంగంలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం ఈమె హైదరాబాదులో 'శ్రియ సోమ్' అనే లేబుల్ హౌస్ ను స్థాపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: