అయితే తేజూ విషయంలో ఎక్కడ కూడా ఎలాంటి తప్పు లేదని అని సీసీ టీవీ ఫుటేజ్ ను బట్టి తేలిపోయిందని తెలుస్తుంది.అతడి స్పీడ్ నార్మల్ గా ఉంది దానికి తోడు అతడు చాలా సేఫ్టీ ఫ్రికాషన్స్ తీసుకున్నాడని సమాచారం. అందువల్ల అతడికి దెబ్బలు తగల్లేదని తెలుస్తోంది. తలకు హెల్మెట్ పెట్టుకున్నాడని సమాచారం. షూ వేసుకుని ఉన్నాడని తెలుస్తుంది. అంతే కాకుండా గ్లౌజ్ లు పెట్టుకుని ఉండటం వల్ల చాలా సేఫ్టీ అయ్యిందని తెలుస్తుంది.అతడికి స్వల్పంగా మాత్రమే దెబ్బలు తగిలాయని సమాచారం.ఈ విషయాలను సోషల్ మీడియాలో ప్రచారం చేసేందుకు మెగా పీఆర్ టీమ్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయని తెలుస్తుంది.
సోషల్ మీడియాలో మెగా కాంపౌండ్ కు చెందిన పీఆర్ లు పలువురు రంగంలోకి దిగి జనాల్లో తేజూ తప్పులేదని ప్రచారం చేస్తున్నారట. కేవలం అక్కడ ఇసుక ఉండటం వల్ల స్కిడ్ అయ్యిందని చెప్తున్నారట.ఆ సమయంలో ఆల్కహాల్ తాగి లేడు దానికి తోడు తేజూ చాలా స్లోగానే వెళ్తున్నాడని తెలిపారట. కనుక ఎలాంటి విమర్శలు చేయడానికి లేదని తెలుస్తుంది. ఒక వేళ సీసీ టీవీ ఫుటేజ్ లేకుంటే తేజూ జీవితాంతం చెప్పినా కూడా ఆయన తాగలేదు అని నమ్మే వారు కాదని తెలుస్తుంది.. స్లోగానే వెళ్తున్నాను అంటే నమ్మేవారు కాదేమో అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారని సమాచారం.
మొత్తానికి సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ చిన్నదే అని దానికి కూడా అతడి తప్పు ఏమీ లేదు రోడ్డు మీద ఇసుక ఉండటం వల్ల స్కిడ్ అయ్యిందని చెబుతున్నారని సమాచారం. తేజూ ను ఈ విషయంలో తప్పుబట్టేలా ఎవరైనా విమర్శలు చేసిన వ్యాఖ్యలు చేసినా కూడా వెంటనే రెస్పాండ్ అవుతున్నారని తెలుస్తుంది. అలా తేజూ కెరీర్ లో ఇదో తప్పుడు ముద్ర లా లేకుండా మెగా పీఆర్ టీమ్ తాపత్రయ పడుతున్నారని సమాచారం. త్వరలో తేజూ తన రిపబ్లిక్ సినిమా తో వస్తాడనుకుంటూ ఉండగా ఇలా యాక్సిడెంట్ అవ్వడం చర్చనీయాంశం అయ్యిందని సమాచారం. సినిమా విడుదలకు సమయం పట్టే అవకాశాలు ఉన్నాయని కొందరు ఊహలు వ్యక్తం చేస్తున్నారని తెలుస్తుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి