టాప్ హీరోల సోదరులు హీరోలుగా నిర్మాతలుగా ఇప్పటికే ఫిలిం ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. అలాగే హీరోల సోదరీమణులు కూడ ఇండస్ట్రీలో రాణించాలని తమవంతు గట్టిప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఇంకా వారు పూర్తిగా సెటిల్ కావడంలేదు. ఈలిస్టులో మహేష్ సోదరి మంజుల ముందువరసలో ఉంటుంది. ఆమె నటిగా నిర్మాతగా రాణించాలని చాల గట్టి ప్రయత్నాలు చేసింది. కాని ఆప్రయత్నాలలో ఆమెకు పూర్తిగా విజయం దక్కలేదు.


ఆతరువాత ఆమె దర్శకురాలుగా మారి తీసిన సినిమా కూడ ఫెయిల్ అవ్వడంతో ఆమె మహేష్ సినిమాకు దర్శకత్వం వహించాలి అన్నకోరిక నెరవేరలేదు. మంచు లక్ష్మి కూడ వివిధ రంగాలలో తన ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నప్పటికీ ఆమె ప్రయత్నాలకు ఇంకా పూర్తి గుర్తింపు దక్కలేదు. ఇప్పుడు ఈలిస్టులోకి నాని సోదరి దీప్తి కూడ చేరిపోయింది. నానీకి అత్యంత సన్నిహితంగా ఉండే దీప్తికి చిన్నప్పటి నుండి ఆమె తమ్ముడు నాని లానే సినిమాలంటే మక్కువ.


నాని హీరోగా సెటిల్ కాక ముందు అసిస్టెంట్ డైరెక్టర్ గా కొనసాగుతున్న రోజులలో అతడికి అనేక విధాలుగా దీప్తి అప్పట్లో ప్రోత్సాహం ఇచ్చింది అంటారు. ఇప్పుడు ఆమె స్క్రిప్ట్ రైటర్ గా మారబోతోంది. చాలకాలం నుండి ఆమెక కథలు వ్రాయాలి అన్నకోరిక ఉందట. ఈవిషయం ఆమె తన తమ్ముడు దగ్గర వ్యక్త పరిస్తే ముందుగా స్క్రిప్ట్ రైటింగ్ లో శిక్షణ తీసుకుని ఆతరువాత ఆన్ లైన్ లో కనిపించే హాలీవుడ్ స్క్రిప్ట్ రైటర్ల కథలను స్టడీ చేసి కథలు ఎలా వ్రాయాలో తెలుసుకోమని చెప్పాడట.


దీనితో ఆమె మరింత రెట్టించిన ఉత్సాహంతో నాని చెప్పినట్లుగా సాధన చేసి నానీకి పంపిందట. అయితే నాని మొదట్లో ఆకథను పెద్దగా పట్టించుకోలేదట. ఆతరువాత నాని కజిన్స్ అంతా నానీకి ఫోన్ చేసి ఆకథను చదవమని చెప్పడంతో నాని తన సోదరి వ్రాసిన కథను చదివి వెంటనే షాక్ అయ్యాడట. అద్భుతంగా ఉన్న ఆకథ తనంకు బాగా నచ్చడంతో ‘మీట్ క్యూట్’ అనే పేరుతో సినిమాని ఇటీవలే తెరకెక్కించారు. సత్యరాజ్ రుహానీ శర్మ వర్ష బొల్లమ్మ అదా శర్మ సునైనా సంచిత వంటి నటీనటులు ఈమూవీలో నటించారు. ప్రముఖ ఓటీటీ సంస్థ ద్వారా విడుదలకాబోతున్న ఈమూవీ సక్సస్ అయితే నాని సోదరికి మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: