విక్టరీ వెంకటేష్.. ప్రముఖ స్టార్ హీరో అక్కినేని నాగేశ్వరరావు ఆప్తమిత్రుడు అలాగే బంధువైన ప్రముఖ నిర్మాత , అత్యధిక చిత్రాలను నిర్మించిన నిర్మాతగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు సాధించిన డా..రామానాయుడు రెండవ కొడుకు వెంకటేష్..1986 లో  కలియుగ పాండవులు అనే సినిమా ద్వారా మొదట సోలో హీరోగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి,  ఆ తర్వాత విక్టరీ వెంకటేష్ గా గుర్తింపు పొందాడు. ఇక మొదటి సినిమాతోనే ఉత్తమ నటుడిగా నంది పురస్కారం లభించింది. 

ఇక ఈ సినిమా కథ ముందుగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో కృష్ణ హీరోగా రావాల్సి వుంది. అయితే కృష్ణ బిజీగా ఉండడంతో మరో సహ నిర్మాత తో కలిసి వేరే సినిమా తీయమని చెప్పాడు కృష్ణ.. కానీ దీనికి రామానాయుడు ఒప్పుకోలేదు..ఇక కృష్ణ నో చెప్పాడు.  ఇక ఇదే కథతో విక్టరీ వెంకటేష్ ను హీరోగా సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఇక ఈ సినిమా విజయోత్సవానికి కృష్ణ హాజరయ్యి, ఈ కొత్త హీరో సినీ ఇండస్ట్రీకి పరిచయం కావడానికి నేనే కారణమంటూ పరిహాసం అడారట.1960 వ సంవత్సరం డిసెంబర్ 13వ తేదీన ప్రకాశం జిల్లాలోని కారంచేడు లో జన్మించాడు.
వెంకటేష్ తల్లి పేరు రాజ్యలక్ష్మి.. ఇక ఈయనకు అన్న ప్రముఖ నిర్మాత దగ్గుపాటి సురేష్ బాబు, ఇద్దరు చెల్లెలు కూడా ఉన్నారు. ఇక ఈయన స్కూలింగ్ అంతా డాన్ బాస్కో స్కూల్ చెన్నై లో గడిచింది. చెన్నైలో లయోలా కాలేజ్ లో బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ కంప్లీట్ చేశాడు.అమెరికాలోని మాంటేరీ విశ్వవిద్యాలయంలో ఎంబీఏ పూర్తి చేశాడు. 1971 లో వచ్చిన ప్రేమనగర్ సినిమాలో బాలనటుడిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.

కె.విశ్వనాధ్ దర్శకత్వంలో స్వర్ణకమలం సినిమాలో నటించి నంది అవార్డు గెలుపొందారు. 1988లో ప్రేమ అనే చిత్రంలో నటించగా ,ఈ చిత్రానికి కూడా అతనికి నంది అవార్డు లభించింది. అంతే కాదు ఇదే సంవత్సరంలో విడుదలైన బ్రహ్మపుత్రుడు సినిమా ద్వారా కూడా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నాడు విక్టరీ వెంకటేష్..



మరింత సమాచారం తెలుసుకోండి: