తమిళ, తెలుగు ఇండస్ట్రీలలో హీరోగా తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు సిద్ధార్థ్.కెరీర్ మొదట్లో లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్న ఈ హీరో.. ఆ తర్వాత టాలీవుడ్ నుండి కోలీవుడ్ కి షిఫ్ట్ అయిపోయాడు. ఇక మళ్ళీ చాలా కాలం తర్వాత 'మహాసముద్రం' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఈ నేపథ్యంలో మొన్నామధ్య సిద్ధార్థ్ గాయాల పాలయ్యాడని,అతనికి సర్జరీ అయ్యిందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.మహాసముద్రం సినిమా షూటింగ్ సమయంలోనే సిద్ధార్థ్ కి గాయాలయ్యాయని..అతనికి సర్జరీ అయ్యిందని దర్శకుడు అజయ్ భూపతి స్వయంగా చెప్పడంతో ఈ విషయం సంచలనంగా మారింది.

ఇక ఆ తర్వాత కూడా టాలీవుడ్ హీరోలు వరుసగా గాయాలు పాలయ్యారు.దీంతో అందరిలో ఆందోళన నెలకొంది.కానీ సిద్ధార్థ్ మాత్రం ఈ విషయంలో నిజం లేదని చెప్పి అందరినీ ఆశ్చర్య పరిచాడు.ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో సిద్ధార్థ్ మాట్లాడుతూ..'నాకు ఏదో సర్జరీ జరిగిందని అందరూ కంగారు పడ్డారు.కానీ అందులో ఏమాత్రం నిజం లేదు.డైరెక్టర్ అజయ్ భూపతికి నాపై ప్రేమ ఎక్కువైంది.మహాసముద్రం క్లైమాక్స్ షూటింగ్ లో నాకు చిన్న గాయమైంది.దానికి నేను ట్రీట్మెంట్ చేయించుకుంటున్న సమయంలో అజయ్ నాకు ఫోన్ చేసాడు.ఆ టైమ్ లో నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నా..

 మళ్ళీ కాల్ చేస్తా అని డైరెక్టర్ అజయ్ భూపతికి చెప్పాను.దానికి అతను సర్జరీ అనుకొని అందరికీ చెప్పేసాడు.ఇక ఆ న్యూస్ కాస్త వైరల్ అయిపోయింది.న్యూస్ వైరల్ అవ్వడంతో మా అమ్మా నాన్నా కూడా కంగారు పడ్డారు.అదేంటి ఇలా చెప్పావ్ అని నేను అజయ్ ను అడిగితే..'మీరే కదా ట్రీట్మెంట్ అన్నారు' అని అన్నాడు.నేను ట్రీట్మెంట్ అన్నాను.సర్జరీ కాదు అని అతనికి క్లారిటీ ఇచ్చాను.అంతే అంతకుమించి ఏమీ లేదు.నేను బాగానే ఉన్నాను' అంటూ చెప్పుకొచ్చాడు సిద్ధార్థ్.ఇక సిద్ధార్థ్, శర్వానంద్ నటించిన 'మహాసముద్రం' సినిమా దసరా కానుకగా అక్టోబర్ 14 న విడుదల కానుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: