మలయాళ ఇండస్ట్రీ నుండి టాలీవుడ్ కి విచ్చేసిన అతి కొద్ది మంది నాయికలలో కీర్తి సురేష్ ఒకరు. అంతేకాదు తెలుగు ప్రేక్షకుల మనసును గెలుచుకుని స్టార్ హీరోయిన్ హోదాను దక్కించుకుంది. ఈమె ప్రముఖ మలయాళ నటి మేనక కూతురు కావడం విశేషం. తల్లి నుండి నటనా పాఠాలను వంట పట్టించుకున్న ఈ అందాల తార అందం, అభినయంతో తెలుగు అభిమానుల సంఖ్యను పెంచుకుంది. మొదట్లో కథానాయికగా పరిచయం అయినప్పుడు కీర్తి సురేష్ తన అమాయక నటనతో అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. "నేను శైలజ" చిత్రంలో కీర్తి సురేష్ క్యూట్ ఫేస్ అంతకంటే క్యూట్ నటనతో మొదటి చూపులోనే ఆడియన్స్ ని తన వైపు తిప్పుకుంది. ఇపుడు ఈ బ్యూటీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.

కీర్తి సురేష్ తల్లి మేనక ఒక హీరోయిన్..ఈమె మెగాస్టార్  చిరంజీవితో కలిసి ‘పున్నమి నాగు’ చిత్రంలో కూడా  నటించారు. తండ్రి కూడా నిర్మాత కావడం ఇలా మూవీ బ్యాగ్ గ్రౌండ్ ఉండటంతో చిన్నప్పటి నుండే ఈమెకు సినిమాలపై మక్కువ ఏర్పడింది. దాంతో ఎనిమిదేళ్ల వయసు నుండే కెమెరా ముందు బాలనటిగా నటించడం మొదలు పెట్టింది. అయితే ఈమె నటిగా మారడం పట్ల తన తల్లి మేనక ప్రభావం చాల ఉండనియూ అంతకు ముందు ఒక ఇంటర్వ్యూలో తెలిపింది. నేను శైలజ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమయిన ఈమె తొలుత తన పాత్రకు డబ్బింగ్ తానే చెప్పాలని చాలా ప్రయత్నించారట. కానీ లాంగ్వేజ్ పై పట్టు లేట్ అవుతుండటంతో ఆ చిత్రంలో ఆమె పాత్రకు అక్షయ  డబ్బింగ్ చెప్పారు.

కానీ మహానటి చిత్రంలో తన పాత్రకు తానే స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్నారు కీర్తి సురేష్, అజ్ఞాత వాసి సినిమాకి కూడా తానే డబ్బింగ్ చెప్పుకున్నారు. పట్టువదలని విక్రమార్కుడిలా తెలుగు భాష లోని మెళుకువలు తెలుసుకుని డబ్బింగ్ చెప్పారు ఈ మలయాళ నటి. అనతి కాలంలోనే పాపులర్  హీరోయిన్ గా ఎదిగి తన ప్రతిభను నటనపై తనకున్న మక్కువను కనబరిచారు.  ఇప్పటి వరకు తెలుగు, మలయాళం, తమిళ్ భాషల్లో దాదాపు 17 సినిమాలకు పైగా  నటించారు. ప్రస్తుతం అగ్ర హీరోల సరసన నటిస్తూ ఫుల్ ఫామ్ లో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: