మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలకు సంబంధించి మంచు విష్ణు చేసిన ప్రచారం బాగా హైలెట్ అయ్యింది. ప్రచారం విషయంలో మంచు విష్ణు అనుసరించిన వ్యూహం అదే విధంగా కొంతమంది పెద్దలతో ఆయన మాట్లాడిన మాటలు అలాగే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలు బాగా హైలైట్ అయ్యాయి. మంచు విష్ణు విజయం సాధించే అవకాశం ఉందా లేదా అనే దానిపై చివరి వరకు సందిగ్ధత ఉన్న మంచు విష్ణు మాత్రం తన విజయంపై చాలా వరకు సానుకూలంగా ఉన్నారని కామెంట్స్ వినిపించాయి. అయితే మంచు విష్ణు గెలవడానికి మరో ప్రధాన కారణం కూడా ఉంది అనే మాట వినపడుతోంది.

మంచు విష్ణు విజయం సాధించడానికి ప్రధానంగా... ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ అలాగే ఒక ప్రముఖ మీడియా సహకారం అందించింది అని అంటున్నారు. మీడియా అధినేత సహకారంతో మంచు విష్ణు ప్రచారంలో కొత్త వాళ్లను కలిశారని అలాగే ఓటు బ్యాంకును పెంచుకోవడానికి గతంలో ఓటు వేయని వాళ్ళని కూడా రప్పించారు అని అందుకే ఆయనతో సన్నిహితంగా ఉన్న వాళ్ళు అలాగే నందమూరి బాలకృష్ణ తో సన్నిహితంగా ఉన్న వాళ్ళు ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్లు చాలా వేగంగా వచ్చి ఓటు వేసి వెళ్లారు అని అంటున్నారు.

సదరు మీడియా అధినేత సూచనల మేరకు ఒక కీలక వ్యక్తి మంచు విష్ణు విజయం కోసం చివరి వరకు పని చేశారని కూడా తెలిసింది. మోహన్ బాబుతో సదరు మీడియా ఛానల్ కు ముందు నుంచి కూడా మంచి సంబంధాలున్నాయి. దీంతో భవిష్యత్తులో ఏం జరగబోతుంది ఏంటి అనే దానిపై ఇపుడు ఆసక్తికర చర్చలు కూడా మొదలయ్యాయి. ఏది ఎలా ఉన్నా సరే మంచు విష్ణు గెలుపు విషయంలో సదరు మీడియా ఛానల్ అనుసరించిన వ్యూహమే ఇప్పుడు కొంతమంది భరించ లేక పోవడానికి ప్రధాన కారణం అని కూడా అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: