మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల తర్వాత మంచు ఫ్యామిలీ మళ్లీ టాలీవుడ్ విషయంలో తన పట్టుని పెంచుకుంది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ విషయంలో మంచు మోహన్ బాబు గతంలో చాలా వరకు దూకుడుగా ముందుకు వెళ్లేవారు. కానీ ఆ తర్వాత కొన్ని విభేదాల కారణంగా మోహన్ బాబు కి పరిస్థితులు కాస్త ఇబ్బందికరంగా మారడంతో ఆయన సైలెంట్ అయిపోయారు. అయితే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో మంచు విష్ణు విజయం సాధించడంతో మోహన్ బాబు కాస్త జోష్ మీద ఉన్నారు అని అంటున్నారు.

ఈ తరుణంలో మోహన్ బాబు కొంతమందితో స్నేహం కోసం చేస్తున్న ప్రయత్నం బాగా హైలెట్ అవుతుంది. ప్రధానంగా నందమూరి బాలకృష్ణతో ఆయన స్నేహం చేయడం టాలీవుడ్లో కొంతమందికి నచ్చడం లేదని చెప్పాలి. అయితే ఇప్పుడు ఆయన తో రాజీ కోసం కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారనే కామెంట్స్ కూడా వినబడుతున్నాయి. ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీకి అందరూ టాలీవుడ్ లో  సన్నిహితంగా ఉన్నారని మెగా ఫ్యామిలీ చెప్పింది టాలీవుడ్ లో జరుగుతుందని భావించారని కానీ ఇప్పుడు మాత్రం అటువంటి పరిస్థితులు లేవు అనే విషయానికి చాలామంది వచ్చేశారని అంటున్నారు.

అందుకనే ఇప్పుడు మంచు ఫ్యామిలీతో అలాగే కొంతమంది టాలీవుడ్ పెద్దలతో స్నేహం కోసం చిన్న హీరోలు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని అలాగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో మోహన్ బాబుకు వ్యతిరేకంగా పని చేసిన వాళ్ళు... ఇప్పుడు ఆయన తో రాజీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. అదేవిధంగా మరికొంతమంది ప్రకాష్ రాజ్ కు సహకరించిన వాళ్లు కూడా మోహన్ బాబు తో సమావేశం కోసం అలాగే మంచు విష్ణుతో సమావేశం కోసం ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీకి తిరుగు లేదని భావించిన తరుణంలో మంచు విష్ణు కుటుంబం సాధించిన విజయం ఇప్పుడు మెగా ఫ్యామిలీని బాగా ఇబ్బంది పెడుతున్న సంగతి విదితమే.

మరింత సమాచారం తెలుసుకోండి: