దాదాపుగా రెండు మూడేళ్ల నుంచి పూజా హెగ్డే తెలుగులో తిరుగులేని విజయాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తెలుగులో ఆమె విషయంలో చాలామంది దర్శక నిర్మాతలు అలాగే కొంత మంది స్టార్ హీరోలు చాలా సానుకూలంగా ఉండటం ఆమెకు బాగా కలిసి వచ్చిన అంశం. ప్రస్తుతం తెలుగులో ఆమెకు వరుస ఆఫర్లు రావడమే కాకుండా అటు హిందీలో కూడా ఆమెకు ఆఫర్లు ఎక్కువగా ఉండటంతో పూజ హెగ్డే డిమాండ్ ఎక్కువగా డిమాండ్ చేస్తున్నారు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు పూజా హెగ్డే కాస్త జాగ్రత్త పడుతున్నారని ఆమెలో భయం కూడా మొదలైంది అని అంటున్నారు.

దానికి ప్రధాన కారణం ఏంటి అనేది ఒక్కసారి చూస్తే... పూజా హెగ్డే గతంలో రెమ్యూనరేషన్ విషయంలో వెనక్కి తగ్గక పోవడం గురించి బాగానే వార్తలు వచ్చాయి. ప్రతి సినిమాకు కనీసం ఏడు కోట్ల వరకు ఆమె డిమాండ్ చేస్తున్నారనే ప్రచారం జరిగింది. కొంతమంది నాలుగు నుంచి ఐదు కోట్ల వరకు డిమాండ్ చేస్తోందని వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు పూజా హెగ్డే కొంత మంది స్టార్ హీరోలు రిజెక్ట్ చేయటం కూడా ఆమెలో కాస్త భయం పెంచే విధంగా చేసిందని అంటున్నారు. ఇటీవల కాలంలో కొంత మంది స్టార్ హీరోలు కీర్తి సురేష్ విషయంలో ఆసక్తి చూపిస్తున్నారు.

గతంలో కీర్తి సురేష్ స్కిన్ షో చేయడం గురించి కాస్త వెనక్కు తగ్గేది. కానీ ఇప్పుడు ఆమె వెనక్కు తగ్గకపోవడంతో పూజా హెగ్డే ని పక్కనపెట్టి దాదాపుగా కీర్తి సురేష్ వైపు చూస్తోంది టాలీవుడ్. అందుకే పూజ హెగ్డే కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తోందని గతంలో మాదిరిగా ఎక్కువగా డిమాండ్ చేయడం లేదని అంటున్నారు. ఎక్కువ డిమాండ్ చేస్తే కచ్చితంగా పక్కన పెడతారు అనే విషయం ఆమెకు స్పష్టంగా అర్థం అయిందని అందుకే అందరితో స్నేహం కోసం చూస్తూ ఒక రూపాయి ఎక్కువైనా సరే చేయడానికి సిద్ధం అవుతోందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: