టాలీవుడ్ కింగ్ నాగార్జున వరుస ప్రాజెక్టు లతో ఎంత బిజీగా ఉన్నాడో మనందరికీ తెలిసిందే, ఇప్పటికే నాగార్జున బుల్లితెర పై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫైవ్ హోస్ట్ గా వ్యవహరిస్తూ బుల్లితెర అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు. ఇలా బుల్లితెరపై ఎంతోమందిని అలరిస్తున్న నాగార్జున సినిమాల విషయానికి వస్తే, సోగ్గాడే చిన్నినాయన సినిమా ప్రీక్వెల్ గా తెరకెక్కుతున్న బంగార్రాజు సినిమా లో నాగార్జున హీరోగా  నటిస్తున్నాడు. ఈ సినిమాలో నాగార్జున  కు జంటగా రమ్యకృష్ణ నటిస్తోంది.

 ఈ సినిమాలో అక్కినేని నాగ చైతన్య కూడా ఒక  ప్రముఖ పాత్రలు కనిపించబోతున్నాడు. అక్కినేని నాగచైతన్యకు జంటగా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్  గా నటిస్తోంది. ఈ సినిమా తో పాటు గరుడ వేగ సినిమాతో మంచి విజయం అందుకనే టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఘోస్ట్ సినిమాలో కూడా నాగార్జున హీరో గా నటిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఇలా వరుస సినిమాలతో ఫుల్ బిజీ గా సమయాన్ని గడుపుతున్న నాగార్జున ఒక మలయాళ సూపర్ హిట్ మూవీ మీద మనసు పడ్డట్టు తెలుస్తోంది. నాగార్జున ను అంత గా ఆకట్టుకున్న ఆ సినిమా పేరే 'ది గ్రేట్ ఇండియన్ కిచన్'. ఈ ఏడాది జనవరి లో మలయాళం లో విడుదలైన ఈ సినిమా అక్కడ భారీ విజయాన్ని అందుకుంది. జియో బాబీ దర్శకత్వం వహించిన ఈ మూవీ లో నిమిషా సాజయన్ .. సూరజ్ వెంజరమూడు ప్రధానమైన పాత్రలను పోషించారు. చాలా తక్కువ బడ్జెట్ లో .. చాలా తక్కువ రోజుల్లో షూటింగ్ ను పూర్తి చేసుకున్న మూవీ ఇది. ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ సినిమా ను రీమేక్ చేయాలని ఉద్దేశం లో నాగార్జున ఉన్నట్లు వార్త లు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: