ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో.. వాసిరెడ్డి పద్మాకర్ రావు ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసి తెలుగులో మాస్ (మారి) గా 2016 ఏప్రిల్ 29వ తేదీన విడుదల చేయడం జరిగింది. ఇక్కడ కూడా మంచి విజయం సాధించడంతో హిందీలో రౌడీ హీరోగా కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయడం గమనార్హం. ఇకపోతే బాహుబలి సినిమా విడుదలైనప్పుడు ఈ సినిమా కూడా విడుదల అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో నటించిన ధనుష్ కు అలాగే కాజల్ కి కూడా మంచి పేరు వచ్చిందనే చెప్పాలి. ఇక తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ కూడా రావడం గమనార్హం.
మారి 2 గా ధనుష్ హీరోగా, సాయి పల్లవి హీరోయిన్ గా తెరకెక్కిన ఈ చిత్రం కూడా అత్యంత ఘన విజయాన్ని అందుకుంది. రౌడీ బేబీ అనే పాట యూ ట్యూబ్ లో ఒక రికార్డు సృష్టించింది.. అతి తక్కువ సమయంలోనే కొన్ని మిలియన్ వ్యూస్ సొంతం చేసుకున్న ఈ సినిమాలోని పాట ఇప్పటికీ ఆల్టైమ్ రికార్డులు సృష్టిస్తూ ఉండడం గమనార్హం.