తెలుగు బుల్లితెర పై సరికొత్త ఎంటర్ టైన్మెంట్ పంచుతూ ప్రస్తుతం బిగ్ బాస్ షో టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటూ దూసుకు పోతుంది అన్న విషయం తెలిసిందే. మొదటి సీజన్ నుంచి ప్రేక్షకులను ఆకర్షించిన ఈ కార్యక్రమంలో ఇక ఇప్పుడు ఐదవ సీజన్ కూడా ఎంతో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. ఇప్పటికే బిగ్బాస్ ప్రారంభమై 50 రోజులు కూడా పూర్తయింది అన్న విషయం తెలిసిందే. ఇక హౌస్ లో కంటెస్టెంట్స్ మధ్య గొడవలు.. నామినేషన్స్ వేడి.. బిగ్ బాస్ కి ఇచ్చే టాస్కుల  రచ్చ మామూలుగా ఉండటం లేదు అని చెప్పాలి. ప్రస్తుతం ఈ కార్యక్రమం బుల్లితెర ప్రేక్షకులను అందరిని అలరిస్తుంది.


 ఈసారి బిగ్ బాస్ 5వ సీజన్లో భాగంగా ఎక్కువమంది ప్రేక్షకులకు తెలిసిన సెలబ్రిటీలే హౌస్ లోకి కంటెస్టెంట్ గా వచ్చారు అన్న విషయం తెలిసిందే. ఇలా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన వాళ్ళలో  ప్రియ తెలుగు చిత్ర పరిశ్రమలో బాగా గుర్తింపు తెచ్చుకున్న నటి. ఎన్నో సినిమాల్లో నటించి తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించింది. అయితే ఒక్కసారిగా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడం తో అందరూ షాక్ అయ్యారు. సాధారణంగా ఇలా బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన వారు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారనే విషయంపై ఎన్నో రకాల గాసిప్స్ హల్చల్ చేస్తూ ఉంటాయి.


 ఇకపోతే ఇప్పుడు ప్రియ రెమ్యునరేషన్ గురించి కూడా కొన్ని వార్తలు వైరల్ గా మారిపోయాయ్. ఇటీవలే తక్కువ ఓట్లు వచ్చిన కారణంగా ప్రియా బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయింది అన్న విషయం తెలిసిందే. కాగా బిగ్ బాస్ హౌస్ లో ప్రియా రెమ్యునరేషన్ ఏంటి అనే దానిపై ఒక వార్త వైరల్ గా మారిపోయింది. ప్రియా కి బిగ్ బాస్ షో నిర్వాహకులు వారానికి 1.5 లక్షల రేషన్ ఇచ్చారట. ఏడు వారాల పాటు షోలో కొనసాగడంతో ఇక 10 లక్షలకు పైగానే ప్రియా సంప్రదించినట్లు తెలుస్తోంది. కాగా ఇటీవలే నెగటివ్ కామెంట్స్ చేసి ప్రేక్షకులను హర్ట్ చేసిన ప్రియా చివరికి తక్కువ ఓట్లు సాధించి ఎలిమినేట్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: