మిరియాల రవీందర్ రెడ్డి ఎంతో భారీగా నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది. అయితే ఎప్పుడూ అందరితో ఎంతో సరదాగా ఉండే బాలయ్య, ఆహా ఓటిటి మాధ్యమం ద్వారా తొలిసారిగా ఆడియన్స్ కి మరింతగా చేరువ కానున్నారు. అందులో అన్ స్టాపబుల్ అనే క్రేజీ షో కి హోస్ట్ గా బాలయ్య వ్యవహరించనున్నారు. ఇటీవల ఈ షో పరిచయ కార్యక్రమం ఎంతో వైభవంగా జరుగగా నేడు కొద్దిసేపటి క్రితం దీని ఫస్ట్ లుక్ ప్రోమో యూట్యూబ్ లో విడుదలై మంచి క్రేజ్ తో దూసుకెళుతోంది.
ఈ స్టైలిష్ ప్రోమోలో బాలయ్య డైలాగ్స్, స్టైల్, యాక్షన్ నిజంగా అదిరిపోయాయి అనే చెప్పాలి. ఆ విధంగా ప్రోమో తోనే అందరి దృష్టిని ఆకర్షించిన బాలయ్య, షో పై అందరిలో ఎంతో ఆసక్తిని రేకెత్తించారు. అయితే త్వరలో దీపావళి కానుకగా ఆహాలో ప్రసారం కానున్న ఈ షో ఒకవేళ కొంచెం క్లిక్ అయి మంచి రేటింగ్స్ అందుకుంటే చాలు, ఇక దబిడి దిబిడే అని, తప్పకుండా బాలయ్య అటు వెండితెరపైనే కాకా ఈ విధంగా బుల్లితెరపై కూడా ప్రేక్షకాభిమానులని అలరించడం ఖాయం అని షో నిర్వాహకులు అంటున్నారు. మరి సూపర్బ్ క్రేజీ ఈ షో ద్వారా నందమూరి నటసింహం ఎంత మేర ఆడియన్స్ ని అలరిస్తారో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి