అల్లు
అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో చేస్తున్న పుష్ప
సినిమా పూర్తి కావచ్చింది. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ
సినిమా మొదటి భాగం షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా ఆ పార్ట్ యొక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
డిసెంబర్ 17వ తేదీన విడుదల కావడంతో ఆ సినిమాను ప్రేక్షకులను మెచ్చే విధంగా ఉండాలని ఆయన తీవ్రంగా కష్టపడుతున్నారు. రెండవ భాగం షూటింగ్ కొన్ని రోజుల బ్యాలెన్స్ ఉందట దాన్ని వచ్చే ఏడాది ఈ చిత్రం చేయనున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు
బోయపాటి శ్రీను తో
సినిమా అనగానే వారికి ఎనలేని సంతోషం కూడా కలిగింది.అయితే ఎవరితో చేసినా కూడా
బన్నీ హిట్ కొట్టాలి అని చెప్పుకుంటున్నారు అభిమానులు. అయితే ఎవరో ఒకరు తొందరగా
సినిమా చేయమని ఆయన అభిమానులు ఎంతగానో కోరుకుంటున్నారు. దానికి కారణం ఇతర హీరోలు ఒకేసారి నాలుగైదు సినిమాలు చేస్తుంటే
అల్లు అర్జున్ ఇంకా పుష్ప ను పట్టుకు వేలాడడం వారికి ఏమాత్రం నచ్చడం లేదు. ఎంత రెండు భాగాలుగా విడుదల అయినా కూడా పుష్ప ప్రాజెక్టు త్వరగా పూర్తి చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఆయన అభిమానుల కోసం అయినా తన రాబోయే సినిమను ప్రకటించాలని కోరుకుంటున్నారు. ఇక మరో వైపు
బోయపాటి శీను సినిమాను వచ్చే నెలలో అనౌన్స్ కానుందని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. మరి దీనిలో ఎంత వరకు నిజం ఉందో చూడాలి.