దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 'RRR' సినిమా కోసం యావత్ సినీ ప్రపంచం ఎంతలా ఎదురుచూస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దక్షిణ భారత దేశంలోనే అత్యధిక బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో లో రూపొందుతున్న ఈ సినిమా దాదాపు వెయ్యి కోట్ల కలెక్షన్స్ ని అందుకుంటుందని.. అంతే కాకుండా ఎన్నో రికార్డులను తిరగరాస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక ఈ సినిమాలో హీరోలుగా నటిస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అనుకుంటున్నారు. ఇక ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి విడుదలైన ప్రతి ఒక్క అప్డేట్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది.

 వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానున్నట్లు ఇప్పటికే మేకర్స్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ ను వేగవంతం చేశారు చిత్ర యూనిట్. ఇక ఈ సినిమా నుండి దీపావళి కానుకగా మరో టీజర్ రానుందని వార్తలు వినిపిస్తుండగా.. తాజాగా ఈ సినిమాకు సంబంధించి జరిగిన ఈవెంట్ లో ఉన్న పోస్టర్స్ లో ఈ సినిమా జనవరి రిలీజ్ అని పేర్కొన్నారు. అయితే కచ్చితమైన రిలీజ్ డేట్ మాత్రం ఆ పోస్టర్స్ లో కనిపించలేదు. ఇక తాజా పోస్టర్స్ లో రిలీజ్ డేట్ క్లారిటీ లేకపోవడంతో రాజమౌళి మళ్లీ ఫ్యాన్స్ ని కన్ఫ్యూజ్ చేస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.

సినిమా జనవరిలో విడుదల అంటే జనవరి 7వ తేదీనా లేక జనవరి చివర్లోనా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ఓ రేంజ్ లో రాజమౌళి ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలోనే నవంబర్ నుంచి ఈ సినిమా నుంచి వరుస అప్డేట్లను ఇవ్వబోతున్నారు. ఇక సినిమా విడుదలకు ఇంకా 70 రోజుల సమయం ఉండడంతో అతి త్వరలోనే ఈ సినిమా నుంచి రెండో పాటను కూడా విడుదల చేయడానికి యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక అంతకంటే ముందే నవంబర్ 1న ఈ సినిమా నుంచి మరో టీజర్ గ్లిమ్స్ రానున్నట్లు తాజాగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది దీంతో ఆ టీజర్ గ్లిమ్స్ కోసం ఫాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

RRR