ప్రస్తుతం ప్రతి టాప్ హీరోకి కనీసం ముగ్గురు పీఆర్ఓ లు ఉండటం పరిపాటిగా మారింది. అయితే ఈ విషయంలో అల్లు అర్జున్ అందరి హీరోలకంటే ఒక అడుగు ముందుకు వేసి సుమారు ఐదుగురు పీఆర్ఓ లను మెయిన్ టైన్ చేస్తున్నాడు అని అంటారు. ‘పుష్ప’ మూవీతో బన్నీ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తూ ఉన్న పరిస్థితులలో ఈ మూవీ ద్వారా బాలీవుడ్ లో తన ఇమేజ్ ని పెంచుకోవాలని చాల వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాడు.


ఇలాంటి పరిస్థితులలో డిసెంబర్ లో విడుదల కాబోతున్న ‘పుష్ప’ క్రేజ్ ను జనవరి 7న విడుదల కాబోతున్న ‘ఆర్ ఆర్ ఆర్’ మ్యానియా ముందు తేలిపోకూడదు అన్న ఉద్దేశ్యంతో బాలీవుడ్ లో ‘పుష్ప’ ప్రమోషన్ ను ఈనెల నుంచే భారీస్థాయిలో చేయాలని అల్లు అర్జున్ ఒక స్థిర నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీనికోసం ముంబాయి చెందిన ప్రోఫిషణల్ పీఆర్టీమ్ ను హైర్ చేసుకుని వారి ద్వారా ‘పుష్ప’ కు ‘ఆర్ ఆర్ ఆర్’ రేంజ్ లో పబ్లిసిటీ చేయాలని భారీ ప్రణాలికలు రచించుతున్నట్లు తెలుస్తోంది.


దీనికోసం నిష్ణాతులైన పిఆర్ టీమ్ ను ప్రత్యేకంగా ముంబాయి నుంచి రప్పించి ఈమధ్య వారితో ఒక సమావేశాన్ని నిర్వహించినట్లు వార్తలు వస్తున్నాయి. రాజమౌళికి ‘బాహుబలి’ ద్వారా ఏర్పడిన ఇమేజ్ తో ‘ఆర్ ఆర్ ఆర్’ కు సంబంధించి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది అన్నవిషయంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ‘పుష్ప’ విషయంలో దర్శకుడు సుకుమార్ కు కాని అదేవిధంగా అల్లు అర్జున్ కు కానీ ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో ఇమేజ్ ఏర్పడలేదు.


దీనితో ‘ఆర్ ఆర్ ఆర్’ మ్యానియాను తట్టుకుని ‘పుష్ప’ నిలబడాలి అంటే ఈమూవీ గురించి అత్యంత భారీ స్థాయిలో బాలీవుడ్ లో పబ్లిసిటీ చేయాలి. అందుకోసమే ముందు చూపుతో అల్లు అర్జున్ ఈవ్యూహాలను అనుసరిస్తూ ‘పుష్ప’ ను ‘ఆర్ ఆర్ ఆర్’ రేంజ్ లో ప్రమోట్ చేయాలని చాలగట్టిగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. కరోనా సెకండ్ వేవ్ తరువాత తెలుగు సినిమాలలో టాప్ హీరోలకు సంబంధించి ఈనెలలో కూడ భారీ సినిమాలు లేవు. డిసెంబర్ నుండి టాప్ హీరోల హంగామా మొదలు కాబోతోంది. వీటిలో ముందుగా వస్తున్న ‘పుష్ప’ తో కలక్షన్స్ సునామీ ఉంటుందని అంచనాలు ఉన్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: