నందమూరి బాలకృష్ణ ఓ టీ టీ లో హోస్ట్ గా చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. అల్లు అరవింద్ నిర్వహిస్తున్న సంస్థ అయిన ఆహలో బాలకృష్ణ అన్ స్టాపబుల్ అనే షో చేస్తుండగా దానికి సంబంధించిన మొదటి ఎపిసోడ్ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మొదటి ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూడగా దానికి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తుండడంతో తెలుగునాడు మొత్తం కూడా దీని కోసం ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూశారు. ఉదయం 11 గంటల 20 నిమిషాల నుండి ఈ షో స్ట్రీమింగ్ కాగా నందమూరి బాలకృష్ణ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి తనదైన స్టైల్ లో హోస్ట్ చేశారు.

ఆయన డాన్స్ తో పాటు డైలాగ్స్ తో కూడా అదరగొట్టాడు. ఇప్పటికే ఈ షో లో మొదటి గెస్ట్ గా ఎవరు వస్తున్నారో ప్రోమో ద్వారా చూపించగా చూసిన అభిమానులు ఒక్కసారిగా మోహన్ బాబు మొదటి గెస్ట్ అనగానే ఎగిరి గంతేసినంత పని చేశారు. షో మొత్తం చూసిన అభిమానులు కూడా అదిరిపోయే విధంగా ఉందని చెబుతుండగా షో మొత్తం చూసిన తర్వాత మొదటి అదిరిపోయింది అని చెబుతున్నారు. ఆయనతో పాటు మంచు విష్ణు మంచు లక్ష్మి కూడా  షో కి రాగా వీరి మధ్య ఎంతో ఆసక్తికర సంభాషణ జరిగింది. మోహన్ బాబు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు.

అంతే కాదు తన కుటుంబానికి ఉన్న రిలేషన్ గురించి కూడా ఆయన వెల్లడిస్తూ మరిన్ని ఆసక్తికర విషయాలు తెలిపారు. నిన్ను ఎప్పుడైనా బాధ పెట్టానా అని మోహన్ బాబుని అడిగితే నన్ను ఎప్పుడూ బాధ పెట్టలేదని అన్నాడు మోహన్ బాబు. కల్లా కపటం తెలియని మనస్తత్వం నీది అన్నాడు... అడిగిన వెంటనే నా కొడుకు కోసం ఒక సినిమా చేసావ్ అని హాట్సాఫ్ చెప్పాడు మోహన్ బాబు.  మంచు మనోజ్ హీరోగా నటించిన ఊ కొడతారా ఉలిక్కిపడతారా సినిమాలో బాలకృష్ణ ఓ కీలక పాత్రలో నటించగా ఆ చిత్రం ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: