అవును ఇది నిజమే. మాస్ మహారాజా రవితేజా కత్తి లాంటి పాత్రలో కనిపించబోతున్నారు. మాస్ ఆడియన్స్ లో తనకంటూ ప్రత్యేక ఆకర్షణను సంపాదించుకున్న రవితేజా చాలా క్లిష్టమైన పాత్రలను ఎన్నో చేశారు. ఆయన ముందు ఇపుడు సవాల్ చేసే పాత్ర ఒకటి వచ్చింది. దాన్ని ఆయన హ్యాండిల్ చేసే విధానం ఎలా ఉంటుంది అన్నదే చర్చ.

ఆ పాత్ర ఒకరి జీవితం. ఇప్పటికి యాభై ఏళ్ల క్రితం విజయవాడ పరిధిలో స్టూవర్టుపురం లో టైగర్ నాగేశ్వరరావు అనే దొంగ ఉండేవాడు. ఆయన నెటోరియస్ క్రిమినల్ అని పోలీస్ రికార్డులు చెబుతాయి. ఆయన ఆనాడే పోలీసులకు చిక్కకుండా దొరకకుండా చేసిన నేరాలు ఒక చరిత్ర. అలాంటి కరడు కట్టిన టైగర్ నాగేశ్వరరావు అతి పెద్ద  జైలు గోడల నుంచి తప్పించుకుని బయటకు వచ్చేవారని ఈ రోజుకీ తెలిసిన వారు  కధలు కధలుగా చెప్పుకుంటారు.

ఆయన జీవిత చరిత్రను సినిమాగా తీయాలని ఎందరో ఎన్నో  ఏళ్ళుగా ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. ఇపుడు రవితేజా 71వ చిత్రంగా ఇది రూపుదిద్దుకుంటోంది. ఇందులో  టైగర్ నాగేశ్వరరావు గా రవితేజా చేయడం అంటే ఒక చాలేంజి అని చెప్పాలి. నిజానికి రియల్ స్టోరీస్ లో నటించడం అంటే కత్తి మీద సాము లాంటిది 1987 దాకా జీవించి ఉన్న టైగర్ నాగేశ్వరరావు గా పరకాయ ప్రవేశం చేయడం అంటే రవితేజా నటన మరో ఎత్తుకు వెళ్ళినట్లే. దాని కోసం చేయాల్సినవి అన్నీ మాస్ మహారాజా చేస్తున్నారుట. మొత్తానికి రవితేజా కత్తి లాంటి పాత్రలో ఎలా ఇమిడిపోతారో చూడాల్సిందే. ఈ మూవీని పాన్ ఇండియా లెవెల్ లో నిర్మిస్తున్నారు అంటున్నారు.  అభిషేక్ అగర్వాల్ నిర్మాణ బాధ్యతలు చూస్తున్నారు. దీని కోసం పెద్ద ఎత్తున బడ్జెట్ ని ఖర్చు చేస్తారని టాక్. ఒక విధంగా సెల్యూలాయిడ్ మీద ఒక అద్భుతంగా ఆవిష్కరించాలన్నదే మేకర్స్ ప్రయత్నంగా ఉంది అంటున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: