కార్తికేయ హీరో గా తాన్యా రవిచంద్రన్‌ హీరోయిన్ గా వీవీ వినాయక్‌ శిష్యుడు శ్రీ సరిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాజా విక్రమార్క’. ఆదిరెడ్డి టి. సమర్పణలో ‘88’ రామారెడ్డి నిర్మించిన ఈ సినిమా నవంబర్ 12 వ తేదీన విడుదల కాబోతుంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో ఈ  చిత్ర బృందం పలు టీవీ ఛానల్ ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ హల్ చల్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ సినిమా హీరోయిన్ తాన్యా రవిచంద్రన్‌ కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. తాన్యా రవిచంద్రన్‌ మాట్లాడుతూ.. రాజా విక్రమార్క సినిమా కథతో పాటు నా పాత్ర కూడా బాగా నచ్చడంతో ఈ సినిమా చేశాను. ఈ సినిమాలో నా పాత్ర పేరు కాంతి, తను హోం మినిస్టర్ కూతురు అయినప్పటికీ చాలా సింపుల్ గా ఉండే అమ్మాయి అని తెలియజేసింది.

మరియు తాన్యా రవిచంద్రన్‌ చిన్న తనం నుండి నాకు సినిమాలు అంటే చాలా ఆసక్తి అని, అయితే మా పేరెంట్స్ ముందు పి.జి పూర్తి ఆ తర్వాతే సినిమాలు అని అన్నారు. అయితే పీజీ చదువుతున్న రోజుల్లోనే సినిమా ఛాన్స్ రావడంతో ఒక్క సినిమా చేస్తాను అని చెప్పాను కానీ తమిళంలో వరుసగా మూడు మూవీస్ చేశాను అని చెప్పుకొచ్చింది. అవి పూర్తయ్యాక పీజీ ( ఎంఏ హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ – హెచ్‌ఆర్‌) పూర్తి చేసి మళ్లీ మూవీస్ లోకి వచ్చాను అని తెలిపింది. మా తాతయ్య (తమిళ హీరో రవిచంద్రన్‌) చాలా హార్డ్‌ వర్కింగ్‌.. ఆయనకు అంకితభావం, క్రమశిక్షణ ఎక్కువ తాన్యా రవిచంద్రన్‌ తెలిపింది. ఇలా  తాన్యా రవిచంద్రన్‌ సినిమా గురించి మరియు ఇతర విషయాలను తెలియజేసింది. మరి రాజా విక్రమార్క సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో తెలియాలంటే సినిమా విడుదల తేదీ వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: