ఎంత పెద్ద స్టార్ హీరో సినిమాల్లో నటించినప్పటికీ సినిమా ప్రమోషన్స్ కి రాను అంటూ ముందుగానే రూల్స్ కూడా పెడుతుంది. అయినప్పటికీ ఈ అమ్మడుని తమ సినిమాల్లో తీసుకోవడానికి దర్శక నిర్మాతలు ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉండటం గమనార్హం. దశాబ్ద కాలానికి పైగానే దక్షిణాది చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది ఈ ముద్దుగుమ్మ. మరికొన్ని రోజుల్లో బాలీవుడ్లో కూడా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతుంది అని తెలుస్తోంది. అది కూడా బాలీవుడ్ బాద్షా షారుక్ఖాన్ సినిమాతో బాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతోంది ఈ లేడీ సూపర్ స్టార్ నయనతార.
ఇక ఈ సినిమాకు అటు అఖిల్ దర్శకత్వం వహిస్తూ ఉండటం గమనార్హం. సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇక నయనతార పాత్ర ఈ సినిమాలో ఎలా ఉండబోతోంది అనే దానిపై కూడా ఆసక్తి నెలకొంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే కొన్ని రోజుల వరకు షూటింగ్ కూడా జరిగింది అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవలే షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడం తో ఈ కేసు విషయంలో ఎంతో బిజీగా ఉన్నా షారుక్ ఖాన్ షూటింగ్ కి గత కొన్ని రోజుల నుంచి డుమ్మా కొడుతున్నాడట. దీంతో ఇక ఇప్పుడు ఈ సినిమా కోసం డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఈ సినిమా నుంచి నయనతార తప్పుకోబోతుంది అనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయంపై స్పందించిన నయనతార క్లారిటీ ఇచ్చింది. తాను సినిమా నుంచి తప్పుకుంటానన్న వార్తల్లో నిజం లేదని.. ఈ సినిమాలో ఇన్వెస్టిగేటివ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాను అంటూ తెలిపింది నయనతార.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి