నాగార్జున ను వెండితెర మన్మధుడు గా పిలుస్తూ ఉంటారు. దీనికి తగ్గట్టుగానే నాగ్ తనకు 62 సంవత్సరాలు వయసు వచ్చినా తాను కూడ ఎవర్ గ్రీన్ హీరో అన్న భావనలో ఉంటాడు. ఆ మధ్య వచ్చిన ‘మన్మధుడు 2’ మూవీలో నాగార్జున రొమాన్స్ ను నేటి యువతరం ప్రేక్షకులు అంగీకరించ లేకపోయారు.
దీనికితోడు ఆమూవీ కూడ ఘోరమైన ఫ్లాప్ గా మారడంతో నాగ్ ఇక అలాంటి పాత్రలో చేయకపోవచ్చు అని చాలామంది భావించారు. అయితే నాగార్జున ఆలోచనలు ఏమాత్రం మారలేదనీ అతడి లేటెస్ట్ మూవీ ‘బంగార్రాజు’ మూవీకి సంబంధించిన మొదటిపాట ‘లడ్డుండ’ పాటను విన్నవారికి అర్థం అవుతుంది. దీనికితోడు ఈ పాటకు సంబంధించిన వీడియోలో కనిపిస్తున్న ఫోటోలలో నాగార్జున లుక్ ను చూసినవారు ఇంకా నాగ్ కి వెండితెర మన్మధుడు అని పిలిపించుకోవడం ఎంత సరదానో అర్థం అవుతుంది.
కొన్ని సంవత్సరాల క్రితం వచ్చిన ‘సోగ్గాడే చిన్నినాయన’ మూవీకి ప్రీక్వెల్ గా రూపొందింపబడుతున్న ఈ మూవీ పై నాగార్జున చాల ఆశలు పెట్టుకున్నాడు. అయితే ప్రస్తుతం సినిమాలు చూస్తున్న ప్రేక్షకులలో అధిక శాతం 18 నుంచి 25 సంవత్సరాలు లోపు ఉన్న యూత్ ఎక్కువగా ఉన్నారు. వారి అభిరుచులు చాల విభిన్నంగా ఉంటున్నాయి. సీనియర్ హీరోలు క్రేజీ హీరోయిన్స్ తో రొమాన్స్ చేస్తే అంగీకరించే స్థితిలో ప్రస్తుతం వారు లేరు.
వాస్తవ దృష్టితో ఉంటూ సమాజానికి దగ్గరగా ఉండే కథలను సన్నివేశాలను ప్రస్తుతతరం ప్రేక్షకులు బాగా ఇష్టపడుతున్నారు. లేటెస్ట్ గా అమెజాన్ లో విడుదలైన 'జై భీమ్’ సినిమాకు లైకులు కొడుతున్న వారిలో ఎక్కువమంది యూత్ అన్న విషయం తెలిస్తే మారిన అభిరుచులు స్పష్టంగా తెలుస్తాయి. ఇలాంటి పరిస్థితులలో మారిన అభిరుచులను పరిగణలోకి తీసుకోకుండా నాగార్జున వెండితెర మన్మధుడు ఇమేజ్ పై ఇంకా ఎందుకు సరదా పడుతున్నాడు అంటూ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ మూవీ ఫలితం బట్టి నాగ్ ఆలోచనలలో మార్పులు జరిగే ఆస్కారం ఉంది అన్న మాటలు వినిపిస్తున్నాయి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి