తమిళ హీరో సూర్య లేటెస్ట్ మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతున్న సందర్భంగా ఈమూవీకి వస్తున్న ప్రశంసలతో పాటు ఆదరణ కూడ ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. గిరిజనులు అణగారిన వర్గాలకు చెందిన అమాయకపు ప్రజలపై కొందరు పోలీసులు అన్యాయంగా చేసే దాడిని చాల సహజంగా ఈసినిమాలో చూపించడంతో ఈమూవీ అందరికీ బాగా నచ్చడమే కాకుండా ఈ మూవీ ప్రస్తుతం అంతర్జాతీయంగా ట్రెండింగ్ గా మారింది.


అంతర్జాతీయ సినిమా రేటింగ్ సంస్థ ఐఎండీబీ లేటెస్ట్ గా విడుదల చేసిన జాబితాలో ఈ మూవీకి ప్రపంచంలోనే అత్యధిక రేటింగ్ వచ్చిన మూవీగా నెంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించింది. 56 వేలకు పైగా ఓట్లతో 9.6 రేటింగ్ పాయింట్స్ తో IMDB లో మొదటి స్థానంలో ఈ మూవీ నిలిచింది. ఇక 97 శాతానికి పైగా గూగుల్ యూజర్లు ఈ చిత్రాన్ని లైక్ చేశారని తెలుస్తోంది.



ప్రపంచ వ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదలయ్యే సినిమాలకు ఐఎమ్డీబీ రేటింగ్ ఇస్తూ ఉంటుంది. ఈ రేటింగ్స్ లో ఇప్పటివరకు 1994లో విడుదలైన ‘ది షాషాంక్ రిడంప్షన్’ మూవీ ఫస్ట్ ప్లేస్ లో ఉండగా ఆమూవీని రెండవ స్థానంలోకి నెట్టి ఇప్పుడు మొదటి స్థానంలోకి వచ్చి చేరింది.


 ఈ మూవీని కేవలం 10 కోట్ల పెట్టుబడితో పూర్తి చేసి ఈ మూవీని తమిళ తెలుగు హిందీ భాషలలో ఒకేసారి అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదల చేయడంతో అమెజాన్ సంస్థ సూర్య సొంత నిర్మాణ సంస్థకు 45 కోట్లు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలే నిజం అయితే ఈ మూవీతో సూర్యాకు 35 కోట్ల లాభం వచ్చింది అనుకోవాలి మరి ఇలాంటి తెలివితేటలు మన సీనియర్ హీరోలకు ఎందుకు లేవు అన్నది సమాధానం లేని ప్రశ్న. ప్రస్తుతం ఈ ట్రెండ్ ను గ్రహించి కాబోలు వెంకటేష్ తెలివిగా రానా తో కలిసి ఒక వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే..



మరింత సమాచారం తెలుసుకోండి: