తెలుగు చిత్రపరిశ్రమలో ఎక్కువ మంది హీరోలు ఉన్న ఫ్యామిలీ గా కొనసాగుతుంది మెగా ఫ్యామిలీ. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి వారసులుగా ఎంతోమంది తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. దాదాపు అరడజనుకు పైగా హీరోలు తెలుగు చిత్రపరిశ్రమకు ఎంట్రీ ఇచ్చారు. ఇక ప్రతి ఒక్కరు కూడా తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుని దూసుకుపోతున్నారు. అయితే ఇక వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన వారు ఎంత పెద్ద స్టార్ హీరోలుగా మారినప్పటికీ.. మెగా ఫ్యామిలీలో పెద్దలుగా కొనసాగుతున్న చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబులు మాత్రం అమితంగా అభిమానిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.



 ప్రస్తుత మెగా ఫ్యామిలీలో పెద్దగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా బ్రదర్ నాగబాబు లలో ఎవరు ఎక్కువ ఇష్టం అనే ఎక్కడ అడిగినా కూడా సమాధానం చెప్పలేకపోతు ఉంటారు. ఎందుకంటే ముగ్గురు పైన అంతలా అమితమైన ప్రేమను చూపిస్తూ ఉంటారు. అయితే ఈ ముగ్గురిలో తనకు ఎవరూ అంటే ఇష్టమో ఇటీవలే మెగా డాటర్ నిహారిక చెప్పుకొచ్చింది. ఈటీవీలో ప్రసారమైన ఆలీతో సరదాగా అనే కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చింది మెగా డాటర్ నిహారిక. ఇక ఎప్పటిలాగానే అల్లరి అల్లరి చేస్తూ ఎంతోమంది బుల్లితెర ప్రేక్షకులను ఆకర్షించింది.



 అయితే ఇక ఈ షోలో భాగంగా అలా అడిగిన ఆసక్తికర ప్రశ్నలకు అంతకుమించి ఇంట్రెస్టింగ్ సమాధానాలు చెప్పింది నిహారిక. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మీ నాన్న నాగబాబు లలో ఎవరు ఎక్కువ ఇష్టం అంటూ అని అడుగుతాడు. ఈ క్వశ్చన్ కి ఆలోచించాల్సిన అవసరం లేదు. మా నాన్న లేకపోతే నేను అస్సలు బ్రతకలేను.. ఈ ముగ్గురిలో మా నాన్న నాకు ఎక్కువ ఇష్టం అంటూ తెలిపింది నిహారిక. రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి తేజ లలో ఎవరు ఎక్కువ ఇష్టం అంటే ఇక మా అన్న ఎక్కువ ఇష్టం అంటూ చెబుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: