ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు వెంకటేష్. ఇప్పటికే ఎన్నో కమర్షియల్ సినిమాల్లో నటించి తన సత్తా చాటాడు. ఇక ఇప్పుడు కమర్షియల్ సినిమాల జోలికి పోకుండా కథకు ప్రాధాన్యం ఉన్న సినిమాలనే చేస్తున్నారు. గత కొంత కాలం నుంచి వెంకటేష్ ఎంచుకుంటున్న కథలను చూస్తే ఇది స్పష్టంగా అర్థమవుతోంది. విభిన్నమైన కథలతో ప్రతి సినిమాలో కూడా తనలోని నటుడిని ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేస్తున్నారు. ముఖ్యంగా  రీమేక్ సినిమాలకు అయితే వెంకటేష్ పెట్టింది పేరుగా మారిపోయారు. ఇటీవలే నారప్ప అనే రీమేక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించి నటనతో అందరినీ మంత్రముగ్ధులను చేశారు. ఇప్పుడు దృశ్యం 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.


 అయితే ఇప్పటికే వెంకటేష్ హీరోగా వచ్చిన దృశ్యం సినిమా అందరూ చూసే ఉంటారు. ఊహించని ట్విస్ట్ లతో దృశ్యం సినిమా ప్రతి ఒక్కరిని ఫిదా చేసింది అని చెప్పాలి.. సినిమాకు కొనసాగింపుగా ఇక ఇప్పుడు దృశ్యం 2  ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వేదికగా ఈ సినిమా విడుదలైంది. ఇక దృశ్యం 2 విషయానికి వెళితే.. దృశ్యం సినిమాలో వరుణ్ కనిపించకుండాపోయిన కేసు పూర్తిగా క్లోజ్ అవుతుంది. అక్కడితో సినిమా అయిపోతుంది. ఇక్కడ దృశ్యం 2 మొదలు కావడమే వెంకటేష్ ఉన్నత జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. కేబుల్ ఆపరేటర్ స్థాయి నుంచి సినిమా థియేటర్ ఓనర్ స్థాయికి ఎదుగుతాడు రాంబాబు.


 అంతా సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో ఊహించని ట్విస్ట్ వెలుగులోకి వస్తుంది. కేసును పోలీసు శాఖ సీక్రెట్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది అన్న విషయం రాంబాబు కుటుంబానికి తెలుస్తుంది. ఇక అక్కడి నుంచి అటు ప్రేక్షకుల్లో కూడా ఉత్కంఠ మొదలవుతుంది. ఇక అక్కడినుంచి సినిమా చూస్తున్న ప్రేక్షకులకు ఉత్కంఠ పెరిగి గుండె  వేగం కూడా పెరిగిపోతుంది. కేస్ క్లోస్ అయిపోయింది అనుకుంటున్న సమయంలో మళ్ళీ ఓపెన్ కావడం తో రాంబాబు కుటుంబం మళ్లీ మానసిక ఒత్తిడి భయాలకు గురవుతుంది. ఈ క్రమంలోనే సినిమా ఉత్కంఠభరితంగా సాగుతున్న సమయంలో రాంబాబు హత్య చేసినట్లు ఒప్పుకొని లొంగిపోతాడు. దీంతో కథ అయిపోతుందేమో అని ప్రేక్షకులు భావిస్తారు. కానీ అక్కడే ఊహించని ట్విస్ట్ ఉంటుంది ఇలా అడుగడుగునా ట్విస్టులతో సినిమా చూస్తున్న ప్రేక్షకులను ముని వేళ్ళపై నిలబెట్టాడు  దర్శకుడు. వెంకటేష్రీమేక్ తో మరో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: