టాలీవుడ్ సీనియర్ టాలీవుడ్ హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ అన్ స్టాపబుల్ టాక్ షో రెండు వారాలకే కనిపించకుండా పోవడంపై నందమూరి అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య చేతికి ఆపరేషన్ అవ్వడం వలన ఈ షూటింగ్ లో పాల్గొనడానికి వీలు కుదరలేదు. ఇక దాంతో బాలయ్య తన అన్ స్టాపబుల్ కు బ్రేక్ ఇచ్చారు. ఇప్పటికి కూడా బాల కృష్ణ చేతి కట్టుతోనే ఉన్నాడు. అయినా కూడా ఇప్పటికే తన షో ఆలస్యం అయ్యిందనే ఉద్దేశ్యంతో మూడవ ఎపిసోడ్ కు సిద్దం అవ్వడం జరిగింది.మూడవ ఎపిసోడ్ ను బ్రహ్మానందంతో చేయబోతున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.

ఇక ఆ విషయమై అధికారికంగా ప్రకటన అనేది రావాల్సి ఉంది. కాని మూడవ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను ఆహా టీమ్ ఇటీవల విడుదల చేయడం జరిగింది. బాల కృష్ణ చేతి కట్టుతోనే ఎంట్రీ ఇచ్చి ఎంతో మంది ఫోన్ కాల్స్.. ఆరోగ్యం ఎలా ఉందని కాదు మూడో ఎపిసోడ్ ఎప్పుడని..ఇక మూడు వారాలు గ్యాప్ వచ్చింది.. కాని వారం వారం వచ్చేందుకు నేనేం సీరియల్ ను కాదు సెలబ్రేషన్ అంటూ బాల కృష్ణ మూడవ ఎపిసోడ్ కు సంబంధించిన ఇంట్రోతో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు.

ఇక ఆహా టాక్ షో లో బాల కృష్ణ నుండి వచ్చిన ఎపిసోడ్స్ రెండు కూడా ప్రజల నుంచి ఇప్పటికే మంచి స్పందన దక్కించుకున్నాయి.ఇక మొదటి ఎపిసోడ్ లో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కనిపించగా.. రెండవ ఎపిసోడ్ లో నాచురల్ స్టార్ నాని సందడి చేశాడు. మొత్తానికి ఈ రెండు ఎపిసోడ్ లో కూడా బాల కృష్ణ పవర్ హౌస్ లాంటి తన ఎనర్జీతో కుమ్మేశాడు. జనాలను ఎంతగానో ఆకట్టుకునే విధంగా ఆహా టీమ్ అన్ స్టాపబుల్ ను బాలయ్య తో సాగిస్తూ వస్తున్న సమయంలో బ్రేక్ పడటం జరిగింది.దాంతో ఇక ఆయన అభిమానులు మళ్లీ ఎప్పుడెప్పుడు మూడవ ఎపిసోడ్ చూడాలి అనుకుంటూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక ఎట్టకేలకు ఆ ఎపిసోడ్ కు సంబంధించిన అధికారిక ప్రకటన రానే వచ్చింది.ఇక చూడాలి ఈ సారి ఈ ఎపిసోడ్ తో బాలయ్య ఇంకెంత బాగా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసి మెప్పిస్తాడో అని.

మరింత సమాచారం తెలుసుకోండి: