నందమూరి నట సింహం బాలకృష్ణ హీరో గా టాలీవుడ్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా అఖండ, ఈ సినిమాలో ముద్దు గుమ్మలు ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్ లుగా నటిస్తుండగా, శ్రీకాంత్ ప్రతినాయకుడి పాత్ర లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో సింహా, లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు రావడం తో ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తగినట్టు గా నే ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదల అయిన  ప్రచార చిత్రాలు, టీజర్, పాటలు, ట్రైలర్ అదిరి పోయే రేంజ్ లో ఉండడం తో ఈ సినిమా పై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇలా ఇప్పటికే ప్రేక్షకుల్లో ఫుల్ గా అంచనాలు నెల కొని ఉన్న ఈ సినిమా డిసెంబర్ 2 వ తేదీన అనగా ఈ రోజు ప్రపంచ వ్యాప్తం గా భారీ ఎత్తున విడుదల కాబోతుంది.

ఈ సందర్భం గా తెలుగు కామెడీ దర్శకు లలో ఒకరైన అనిల్ రావిపూడి సోషల్ మీడియా వేదిక గా బాలకృష్ణకు, బోయపాటి శ్రీను కు మరియు అఖండ చిత్ర బృందా నికి బెస్ట్ విషెస్ తెలియజేశాడు. అనిల్ రావిపూడి సోషల్ మీడియా లో చేసిన పోస్ట్ ద్వా రా అఖండ సినిమా బ్లాక్ బాస్టర్ విజయాన్ని సాధించాలి అని, మళ్లీ తెలుగు సినిమా ఇండస్ట్రీసినిమా తో వెలిగి పోవాలి అంటూ పోస్ట్ చేశాడు. నందమూరి నట సింహం బాలకృష్ణ ఈ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వం లో ఒక సినిమాలో నటించబోతున్న విషయం అందరికీ తెలిసిందే, ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా ఇప్పటికే పూర్తి అయ్యాయి, గోపీచంద్ మలినేని సినిమా తర్వాత బాలకృష్ణ, అనిల్ రావిపూడి దర్శకత్వం లో ఒక సినిమాలో నటించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: