నాగశౌర్య 'జాదూగాడు' లాంటి మాస్ మూవీస్ చేసినా, ఆడియన్స్‌లో మాత్రం లవర్‌బాయ్ ఇమేజే ఉంది. అయితే 'లక్ష్య' సినిమాతో ఈ ఇమేజ్‌ని కంప్లీట్‌గా మార్చేసుకుంటున్నాడు శౌర్య. ఆర్చరీ బ్యాక్‌డ్రాప్‌తో వస్తోన్న ఈ సినిమా కోసం సిక్స్ ప్యాక్‌లోకి వెళ్లాడు శౌర్య. ఇక ట్రాన్స్‌ఫర్మేషన్ చూసి శర్వానంద్ లాంటి హీరోలు కూడా ఆశ్చర్యపోతున్నారు. విజయ్ దేవరకొండ బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో 'లైగర్' అనే సినిమా చేస్తున్నాడు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాతోనే బాలీవుడ్‌లో అడుగుపెడుతున్నాడు విజయ్. ఇక నార్త్‌లో డెబ్యూ మూవీతోనే సాలిడ్ ఫాలోయింగ్ పెంచుకోవాలని చాలా కష్టపడుతున్నాడు. రియల్ బాక్సింగ్ చాంపియన్‌లా కనిపించడానికి కటౌట్ మొత్తాన్ని మార్చుకున్నాడు. బాక్సింగ్‌లో ట్రైనింగ్ తీసుకున్నాడు. అలాగే కండలు కూడా పెంచాడు విజయ్.
వరుణ్ తేజ్ ఇప్పటివరకు రెగ్యులర్ లుక్‌లోనే కనిపించాడు. మాస్ రోల్స్ చేసినా మజిల్డ్ బాడీపై పెద్దగా ఫోకస్ చెయ్యలేదు. అయితే కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో చేస్తోన్న 'గని' సినిమా కోసం గంటలకొద్ది వర్కవుట్స్ చేశాడు వరుణ్. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతోన్న ఈ సినిమా కోసం కండలు పెంచాడు. అలాగే బాక్సింగ్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు వరుణ్.
నిఖిల్ రెగ్యులర్ లవ్‌స్టోరీస్ పక్కనపెట్టి చాలా కాలమైంది. వైవిధ్యమైన సినిమాలతో కెరీర్‌ని యూనిక్‌గా డిజైన్ చేసుకుంటున్నాడు. అలాగే కటౌట్‌ని డిఫరెంట్‌గా మార్చుకుంటున్నాడు. 'కార్తికేయ2' సినిమా కోసం కంప్లీట్‌గా మారిపోయాడు. బాడీ బిల్డ్ చేసి కొత్తగా కనిపిస్తున్నాడు నిఖిల్.
టాలీవుడ్‌లో ఫస్ట్ సిక్స్ ప్యాక్ హీరోగా అల్లు అర్జున్‌కి ఒక స్పెషాలిటీ ఉంది. ఇక అన్నయ్య రూట్‌లోనే స్టార్ మార్చుకోవాలని ట్రై చేస్తోన్న అల్లు శిరీష్ కూడా అన్నయ్యలాగే కండలు పెంచుతున్నాడు. 'ప్రేమ కాదంట' సినిమా కోసం సిక్స్‌ప్యాక్ బిల్డ్ చేశాడు శిరీష్. ఈ ఫోటోలపై సోషల్ మీడియాలో క్రేజీ కామెంట్స్ కూడా వచ్చాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి