2021 సంవత్సరం ఆఖరుకు రావడంతో ఈ ఏడాది వచ్చిన సినిమాల గురించి ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఏ సినిమా ఎక్కువగా గూగుల్ లో చర్చకు వచ్చింది అనే అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తుండగా వాటిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేకపోవడం గమనార్హం. మన దగ్గర తెరకెక్కిన ఒక్క సినిమా కూడా గూగుల్ సెర్చ్ లో సంపాదించుకోలేదు. కారణాలేవైనా కూడా ఎక్కువగా తమిళ హిందీ సినిమాలే ఈ లిస్టులో స్థానం దక్కించుకోవడం విశేషం. స్టార్ హీరోలు నటించిన సినిమాలే ఈ లిస్టులో టాప్ సినిమాలు గా ఉండడం ఇప్పుడు వారి అభిమానులను ఎంతగానో సంతోష పెడుతుంది.

ఈ ఏడాది టాప్ గూగుల్ సెర్చ్ అయిన సినిమా లేంటో ఇప్పుడు తెలుసుకుందాం. జై భీమ్ సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదలై సంచలన విజయం సాధించింది. ఈ చిత్రాన్ని గూగుల్ లో చాలా మంది సెర్చ్ చేయగా ఈ సంవత్సరానికి టాప్ సెర్చ్డ్ మూవీ ఇదే. ఆ తర్వాత సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటించిన శేర్శా చిత్రం గూగుల్ లో అత్యధికంగా వెతకబడిన రెండవ సినిమాగా నిలిచింది. ఈ చిత్రం కూడా అమెజాన్ ప్రైమ్ లో విడుదలవడం విశేషం. ఇక సల్మాన్ ఖాన్ నటించిన సినిమా మూడవ అత్యధికంగా సెర్చ్ కాబడిన చిత్రంగా నిలిచింది. 

ఇక అక్షయ్ కుమార్ హీరోగా నటించిన బెల్-బాటమ్ చిత్రం కూడా గూగుల్ లో అత్యధికంగా సెర్చ్ కాబడింది. ఇంటర్నేషనల్ గా మార్వెల్ స్టూడియోస్ నిర్మించిన ఎటర్నల్స్ సినిమా ను కూడా ప్రేక్షకులు బాగా గూగుల్ లో బాగా వెతికారు. సౌతిండియా సినిమాల విషయానికి వస్తే విజయ్ హీరోగా నటించిన మాస్టర్ చిత్రం ఎక్కువ గా వెతికారు. ఈ చిత్రం వంద కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఇక అక్షయ్ కుమార్ నటించిన సూర్యవంశీ సినిమా కూడా గూగుల్ లో ఎక్కువగా వెతికారు. ఈ చిత్రం 200 కోట్ల క్లబ్ లో చేరి సూపర్ హిట్ గా నిలిచింది. ఇక దృశ్యం2 , భుజ్, ఆ తర్వాత గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ సినిమాలను కూడా ప్రేక్షకులు ఎక్కువగా వెతికారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: