అల్లు అర్జున్ హీరో గా రష్మిక మందన హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వం లో తెరకెక్కిన పుష్ప, ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాలో సునీల్, అనసూయ ముఖ్య పాత్రలో నటిస్తుండగా, మలయాళం విలక్షణ నటుడు ఫహాద్ ఫాసిల్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు, ఈ సినిమా ను ఎంతో భారీ ఖర్చు తో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించారు. ఇప్పటికే జనా లలో మంచి అంచనాలు కలిగి ఉన్న ఈ సినిమా ను ఈ రోజు అనగా డిసెంబర్ 17 వ  తే దీన థియేటర్ లలో విడుదల కాబోతుంది. రెండు భాగాలుగా తెరకెక్కబోతున్న ఈ సినిమా లో మొదటి భాగం పుష్పా ది రైస్ ఈ రోజు విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమా విడుదల సందర్భం గా చిత్ర బృందం పలు టీవీ ఛానల్ ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ సినిమా ను ప్రమోట్ చేస్తున్నారు, అయితే ఈ క్రమం లో తాజా గా సినిమా బృందం ఒక ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు, అందులో అనేక విషయాలను చిత్ర బృందం తెలియజేసింది.

 అయితే ఈ ప్రెస్ మీట్ లో దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ, ఈ సినిమా గురించి అనేక విషయాలను తెలియజేశాడు. సుకుమార్ మాట్లాడుతూ.. మొదట ఈ సినిమా ని పాన్ ఇండియా సినిమా గా చేద్దాము అని అనుకోలేదు, అయితే ఒక రోజు రాజమౌళి గారు ఫోన్ చేసి ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో తీయండి, మీరు తెలుగు లో రిలీజ్ చేస్తే తెలుగు సినిమా అవుతుంది, అదే పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేస్తే అది పాన్ ఇండియా సినిమా అవుతుంది, అని చెప్పారు.  దానితో పుష్ప సినిమా ను పాన్ ఇండియా రేంజ్ లో తీశాను అంటూ సుకుమార్ తెలియ జేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: