అయితే తాజాగా ఈ సినిమాపై ఒక ముఖ్యమైన సమాచారాన్ని..RRR మూవీ మేకర్స్ తెలిపిన ప్రకారం ఈ చిత్రం గ్రాండ్ ఈవెంట్స్ ను ముంబైలో ప్లాన్ చేస్తున్నట్లు గా తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఇక ఈ సినిమాని జనవరి 7వ తేదీన భారీగా థియేటర్లలో విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు చిత్ర యూనిట్ సభ్యులు. ఇక తెలుగులో మరొకసారి ఈ సినిమాతో తన సత్తా ఏంటో చూపించాలని రాజమౌళి ప్రయత్నిస్తున్నారు. అందుచేతనే ఇంతవరకు తెలుగు ఇండస్ట్రీలోని సినిమా విడుదల కాని విధంగా ఈ సినిమాని విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు.
ఇక తాజాగా ఈ సినిమా గ్రాండ్ ఈవెంట్ కు బాలీవుడ్ లోని కొంతమంది నటులు వచ్చే విధంగా ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇక ముంబైలో తెలుగు ఈవెంట్స్ కు, ప్రమోషన్లకు భారీ స్థాయిలోనే రెస్పాన్స్ ఉన్నది. ఇక ఈ సినిమాకి ముఖ్యఅతిథిగా అజయ్ దేవగన్ వస్తున్నట్లుగా ట్విట్టర్ ద్వారా ఆర్.ఆర్.ఆర్ చిత్ర యూనిట్ సభ్యులు తెలియజేయడం జరిగింది. ఈసారి ఏకంగా బాలీవుడ్ లో కూడా తన ప్రమోషన్ చాటాలని రాజమౌళి భావిస్తున్నట్లు గా సమాచారం. ఇక ఈ సినిమా గ్రాఫిక్స్ తో, భారీ బడ్జెట్ తో ఇద్దరు స్టార్ హీరోలతో, కలిసి ఈ మూవీ తెరకెక్కించడం చాలా అద్భుతంగా ఉన్నది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి