భారత క్రికెట్ ప్రేక్షకులందరూ జనవరి 7వ తేదీ గురించి ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.. ఎందుకంటే దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ అనే సినిమా అదే రోజు విడుదల కాబోతుంది. మొదటి రోజు మొదటి షో చూసి  ఆర్ఆర్ఆర్ మేనియా ఎంజాయ్ చేయడానికి భారతీయ సినీ ప్రేక్షకులు అందరూ కూడా సిద్ధమైపోతున్నారు. ఇప్పటికే బాహుబలి సినిమా తో ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ సృష్టించిన రాజమౌళి.. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ అనే సినిమాతో ఎలాంటి  అద్భుతాన్ని సృష్టించబోతున్నారో అన్నదానిపై ప్రస్తుతం అందరూ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక ఆర్.ఆర్.ఆర్ అనే సినిమా విడుదల తేదీని ప్రతి రోజూ వేళ్లపై లెక్క పెట్టుకుంటూ ఉన్నారు సినీ ప్రేక్షకులు.
 ఇక ఇలా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా గురించి ప్రతీ విషయం కూడా హాట్ టాపిక్ గా మారి పోతూనే ఉంటుంది. హీరోల  ఎంట్రీ దగ్గర నుంచి ప్రతి యాక్షన్ సన్నివేశం వరకు కూడా రాజమౌళి ఎలా తెరకెక్కించారు అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను మరింత ఆసక్తిని అంచనాలను పెంచేసింది. ఏమో అనుకున్నాను కానీ రాజమౌళి ఈసారి బాహుబలి ని మించిన సినిమా తీశాడు అంటూ ట్రైలర్ చూసిన తర్వాత ప్రేక్షకులు భావిస్తున్నారు. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్చరణ్, కొమురంభీం పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు.


 ఇక వీరి పాత్రలో మీరు ఎంత ఒదిగిపోయి నటించారు అనే విషయం ఇటీవల విడుదలైన  ట్రైలర్ లో తెలిసిపోయింది. అయితే ఆర్ఆర్ఆర్ సినిమాలో ఇద్దరు హీరోల ఎంట్రీ ఎంతో సాలిడ్ గా ఉండబోతుందట. ఎన్టీఆర్ ఎంట్రీ సన్నివేశంలో.. బల్గేరియా అడవిలో జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి పాదరక్షలు లేకుండానే పరిగెత్తుతూ వస్తాడట. ఇలా ఎక్కడ ఇబ్బందిపడకుండా ఏకంగా అడివిలో చిరుతపులి లాగా పరిగెత్తాడు అంటూ రాజమౌళి చెప్పుకొచ్చాడు. అదే సమయంలో అటు చరణ్ ఎంట్రీ కూడా అద్భుతంగా ఉంటుంది అంటూ తెలిపాడు. రెండు వేల మంది జనాల మధ్య ఎంతో దుమ్ము, రక్తం, చెమట మధ్య చరణ్ ఎంట్రీ ఉంటుందని చెప్పాడు. ఇలా తన కెరియర్లోనే ఈ ఇద్దరు హీరోల ఎంట్రీ అద్భుతంగా తెరకెక్కించా అంటూ రాజమౌలి చెప్పినట్లు  తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: