పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల మధ్య ఎలాంటి సాన్నిహిత్యం ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో ఏకంగా మూడు సినిమాలు వచ్చాయి. వాటిలో జల్సా, అత్తారింటికి దారేది సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవగా.. అజ్ఞాతవాసి సినిమా మాత్రం బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ మరియు దగ్గుబాటి రానా హీరోలుగా నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది. అయితే ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం..

వీరిద్దరూ కలిసి ఇ ఓ సినిమాను నిర్మించే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కోలీవుడ్ అగ్ర నటుడు సముద్రఖని ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నారట. త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన అల వైకుంఠపురం లో సినిమాలో సముద్రకని ఓ కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే.అయితే ఈ సినిమా షూటింగ్ లో సముద్రఖనితో  స్నేహం ఏర్పరుచుకున్న డైరెక్టర్ త్రివిక్రమ్ ఇప్పుడు ఆయన దర్శకత్వం వహిస్తున్న సినిమాని ఫార్చ్యూన్ 4 పతాకంపై నిర్మించనున్నారు. కంటెంట్ బేస్డ్ ఎమోషనల్ డ్రామా గా రూపొందుతున్న ఈ సినిమా నిర్మాణంలో త్రివిక్రమ్ తో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా పాలు పంచుకోబోతున్నారట.

అంతేకాదు ఈ సినిమాని నిర్మించడంతో పాటూ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో పవన్ కళ్యాణ్ నటిస్తున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక గతంలో పవన్ కళ్యాణ్ నిర్మాతగా కొన్ని చిత్రాలు వచ్చినా అవి ఆయనకి ఆశించిన స్థాయి ఫలితాన్ని అందించలేకపోయాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరోసారి త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి పవన్ కళ్యాణ్ నిర్మాతగా మారబోతున్నాట్లు సమాచారం వినిపిస్తోంది.ఇక ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా జనవరి 12న విడుదల కావాల్సిన ఈ సినిమా కొన్ని అనివార్య కారణాల వల్ల వచ్చే ఏడాది ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: