ఇక ట్రైలర్ ని బట్టి చూస్తే ఈ సినిమా మంచి ఎమోషనల్, రొమాంటిక్ జానర్ లో సాగె అద్భుతమైన లవ్ స్టోరీ అని కొంతవరకు మనకు అర్ధం అవుతుంది. ప్రపంచంలో ప్రఖ్యాతి గాంచిన హస్త సాముద్రిక నిపుణుడిగా ప్రభాస్, ప్రేరణ పాత్రలో పూజా హెగ్డే ఇందులో నటిస్తున్నారు. ముఖ్యంగా ట్రైలర్ లో ఫోటోగ్రాఫర్ మనోజ్ పరమహంస అందించిన విజువల్స్ సూపర్బ్ అనే చెప్పాలి. ఇక బీజీఎమ్, ఎమోషన్స్, రొమాంటిక్, యాక్షన్ సీన్స్ కూడా ఎంతో బాగున్నాయి. అలానే ప్రభాస్, పూజా మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ కూడా ఆకట్టుకున్నాయి.
'అమ్మ ప్రేమ గురించి అడిగితే చెప్పు, నా చేతిలో ప్రేమ పెళ్లి లేవు', 'ఐ డోంట్ ఫాల్ ఇన్ లవ్ అలాంటి ప్రేమ నా వల్ల కాదు', 'ప్రపంచ దేశ నాయకులూ అందరూ కలవాలనుకునే గొప్ప హస్తసాముద్రిక నిపుణుడు', 'ఆయన శాస్త్రం చెపితే శాసనం అంటారు', 'నీ ప్రేమ ఎదురవ్వడం ఒక వరం కానీ అందుకోవడం మాత్రం యుద్ధం', 'ప్రాణం పొసే ప్రేమే ప్రాణాలు తీస్తోందా' అంటూ ట్రైలర్ లో వచ్చే డైలాగ్స్ సినిమాపై తప్పకుండా అందరిలో మంచి అంచనాలు ఏర్పరచక మానవు. మొత్తంగా ఒక విజువల్ వండర్ మాదిరిగా ఎంతో అద్భుతంగా ఉంది రాధేశ్యామ్ ట్రైలర్. ఇక ప్రస్తుతం ఈ ట్రైలర్ పలు భాషల్లో యూట్యూబ్ లో మంచి వ్యూస్, లైక్స్ తో దూసుకెళ్తోంది. మరి భారీ పాన్ ఇండియా సినిమాగా కొన్ని వేల థియేటర్స్ లో సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 14న రిలీజ్ కానున్న రాధేశ్యామ్ సినిమా ఎంత మేర ఆకట్టుకుంటుందో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి