ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్న రోజు దగ్గరలోనే ఉంది. 2022 నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఘనంగా విడుదల అవుతున్న ఈ సినిమా ఆర్ ఆర్ ఆర్. ఇక ఈ సినిమా కు దర్శకుడిగా జక్కన్న తన మెదడుకు పదును పెట్టి సినిమాను తెరకెక్కించాడు. ఇకపోతే ఈ సినిమా లో అల్లూరి సీతారామరాజుగా మెగా వారసుడు రామ్ చరణ్, కొమరం భీమ్ గా నందమూరి వారసుడు ఎన్టీఆర్ ఈ సినిమాలో మనకు కనిపించబోతున్నారు..


ఇకపోతే ఈ సినిమా నుంచి విడుదల అవుతున్న ట్రైలర్, టీజర్ ,పోస్టర్, పాటలు ఇలా అన్నీ కూడా ప్రేక్షకులను అలరించడమే కాకుండా వినూత్నంగా ఆశ్చర్యపరిచాయి. ఇకపోతే భాషా ప్రాంతీయం తో సంబంధం లేకుండా అవసరం ఉన్నా.. అవసరం లేకపోయినా ప్రతి చోట కూడా వీరు చిత్రం యూనిట్ మొత్తం వెళ్లి భారీ స్టేజ్ ను ఏర్పాటు చేసి మరి సినిమా ప్రమోషన్స్ నిర్వహించారు. ఇక వీరు ఏర్పాటుచేసిన ప్రమోషన్స్ ప్రతి ప్రాంతంలో కూడా విశేష ప్రేక్షకాదరణ అందుకోవడం గమనార్హం. అంతేకాదు ఈ ప్రమోషన్స్లో ప్రేక్షకాదరణ చూస్తే ఖచ్చితంగా ఈ సినిమా బాహుబలి ని మించి పోతుంది అని రాజమౌళి కూడా చెప్పడం గమనార్హం..


ఇదిలా ఉండగా మన రాష్ట్రంలో టికెట్ రేట్లను తగ్గించి నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్న జగన్ ప్రభుత్వం పెద్ద సినిమాలపై భారీ వేటు వేయడానికి సిద్ధం అయ్యారు. కానీ సినీ ఇండస్ట్రీలో పెద్దలు కోరిక మేరకు జగన్ ప్రభుత్వం కొంత వరకు దిగి ఉందని చెప్పాలి . ఇకపోతే తెలంగాణలోని హైదరాబాదులో జనవరి 7వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తే సినిమా టికెట్ రేట్లు ఇలా ఉండబోనున్నాయట. హైదరాబాదులో సింగిల్ స్క్రీన్ అయితే టికెట్ ధర రూ.200..మల్టీఫ్లెక్స్ లో అయితే రూ.300, అయితే ఇక అన్ని జిల్లాల వారీగా థియేటర్లను 200 రూపాయలు గా టికెట్ ధరను నిర్ణయించారు.. ఇక ఈ విషయాన్ని అధికారికంగా ట్విట్టర్ ద్వారా తెలియజేయడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: