జూనియర్ ఎన్టీఆర్ తన పేరును రామారావు గా మార్చుకుని  హోస్ట్  చేసిన ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ షో ఆశించిన స్థాయిలో రేటింగ్స్ తెచ్చుకోలేక పోయింది. ఇప్పుడు కెరియర్ పీక్ లో ఉండగా తనకు అనేకసార్లు బ్రేక్ ఇచ్చిన రాజమౌళిని నమ్ముకుని గత మూడు సంవత్సరాలుగా మరో సినిమా వైపు చూడకుండా కష్టపడి చేసిన ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదలకు  కౌంట్ డౌన్ మొదలైంది.


రాజమౌళితో జూనియర్ అనుబంధం ‘స్టూడెంట్ నెంబర్ 1’ నుంచి కొనసాగుతూనే ఉంది. ‘సింహాద్రి తో తారక్ రేంజ్ ని మార్చేసిన గొప్ప స్నేహితుడు రాజమౌళి. ఈజోడీ ప్రతిసారీ ఏదో ఒక కొత్త మ్యాజిక్ ను చేసేందుకు కలుస్తూనే ఉంటారు. ఈసారి ‘ఆర్ ఆర్ ఆర్’ లాంటి భారీ పాన్ ఇండియా చిత్రంతో ఇండియా లెవల్ లో సంచలనాలకు రెడీ  అవుతున్నారు.  


ఎన్ని వ్యతిరేక పరిస్థితులు ఎదురౌతు ఉన్నప్పటికీ జనవరి 7 రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ వీరిద్దరి ప్రచారం మరింతగా హోరెత్తుతూనే ఉంది. ఇప్పటివరకు జూనియర్ పాన్ ఇండియా సినిమాలో నటించ లేదు . దీనితో  జూనియర్ కెరియర్ కు ‘ఆర్ ఆర్ ఆర్’ అత్యంత కీలకంగా మారింది.  ఇలాంటి పరిస్థితులలో రాజమౌళి జూనియర్ తో చెవిలో ఏదో రహస్యం చెపుతున్న ఫోటో ఇప్పుడు మీడియాలో వైరల్ అవుతోంది.



ఇంతకీ జక్కన్న ఇలా తారక్ చెవిలో ఏమి చెపుతున్నాడో కానీ అదేదో బ్రహ్మ రహస్యంలానే కనిపిస్తోంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.  ఇది ఆన్ లొకేషన్ స్టిల్ అని అంటున్నారు. ‘ఆర్ ఆర్ ఆర్’ లోగో తో ఉన్న షర్ట్ తారక్ వేసుకున్నాడు. వీరిద్దరు ఏదోచాలా సీరియస్ గానే  మాట్లాడుకున్నట్లు కనిపిస్తోంది. తారక్ ఎంత స్టైలిష్ గా ఉన్నాడో అంతకుమించి జక్కన్న గాగుల్స్ పెట్టుకుని స్టైలిష్ గా  కనిపిస్తున్నాడు. ‘ఆర్ ఆర్ ఆర్’ రిజల్ట్ ఏమిటి అన్నది జనవరి 6న అమెరికాలో ప్రదర్శించబోతున్న  ప్రీమియర్లతో తేలుతుంది. 600కోట్ల నుంచి 1000 కోట్ల మధ్య వసూళ్లతో ‘ఆర్ ఆర్ ఆర్’ కలెక్షన్స్ దుమారం రేగుతుందని జూనియర్ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు..



మరింత సమాచారం తెలుసుకోండి: