జీవితాన్ని మార్చిన మెట్ల పాట అని రాశాను మొగుల‌య్య గురించి..భీమ్లా నాయక్ సినిమాకు సంబంధించి ఆ పాట వ‌చ్చేవ‌ర‌కూ ఎవ్వ‌రికీ ఆయ‌నెవ్వ‌రూ తెలియ‌దు.ఆ మాట‌కు వ‌స్తే నాకూ తెలియ‌దు కానీ ఆ త‌రువాత వారి గురించి తెలుసుకునే ప్ర‌య‌త్నం ఒక‌టి అదే ప‌నిగా చేశాను.తెలుసుకున్నాక అదే ప‌నిగా రాసేందుకు ప్ర‌య‌త్నించాను.ఈ పాటి ఎవ్వ‌రయినా ఈ వారాంతంలోనో లేదా మ‌రోచోట‌నో చేస్తే ఎంతో మంచిది.


తెలంగాణ క‌ళాకారుల జీవ‌న వైవిధ్య‌త‌ను మ‌రిచి మ‌నం మాట్లాడ‌డం త‌ప్పు అని భావిస్తాను.వాళ్ల జీవితం కొంత విభిన్నత‌కు ఆన‌వాలు.సంత‌ల్లో పాట‌లు పాడుకుంటూ, ఎవ్వ‌రో ఇచ్చిన కూర‌గాయలు, ప‌ప్పు, బెల్లాలు, బియ్యం మూట క‌ట్టి ఇంటికి చేరుకునే ఇలాంటి క‌ళాకారులు మ‌న జీవితాల‌కు ఆనందాలు ఇస్తున్నారు.మ‌న జీవన గ‌తులు ఎలా దుర్ల‌భం అయి ఉన్నాయో తార్కాణం అయి నిలుస్తున్నారు.తెలంగాణ సీఎం కేసీఆర్ స‌ర్ కు నేను విన్న‌విస్తున్నాను..


స‌ర్! మీరు ఇలాంటివారికి అండ‌గా ఉండాలి.మీరు మ‌రియు మీ ప్ర‌భుత్వం మంచి ప‌నులు కొన్ని చేసిందని విన్నాను.చ‌దివేను. పొంగిపోయాను..ర‌వీంద్ర భార‌తిని క‌ళ‌ల హార‌తిగా, సాంస్కృతిక వార‌థిగా మార్చిన విధంగానే మీరు ఈ క‌ళాకారుల‌కు ప‌ట్టెడ‌న్నెం పెట్టండి.ప‌ట్టు పంచెలు ఇవ్వండి..ఇదొక్క‌టే స‌ర్ ఈ శ్రీ‌కాకుళం కుర్రాడు వేడుకునేది. సామి నీకు దండ‌మే వేల తీరులా సామి నీకు దండమే ల‌క్ష మొక్కులా..అని పాడుకుంటాను స‌ర్...ప్లీజ్! ప్లీజ్!



వినే గీతం నీ జీవితం అని నేర్పారు కొంద‌రు
ఆర్ధ్ర‌త నిండిన జీవితం  
ఒక గొప్ప ప్ర‌యాణానికి సంకేతం అని చెప్పారు కొంద‌రు
విశ్వ‌నాథ కిన్నెర సాని న‌డ‌కలు చెప్పారు
అవి కిన్నెర పాట‌లు అల‌సిసొల‌సిన న‌ది చెంత
ఓ గానం ఎలా ఉంటుంది?
వాగు వంక‌ల వ‌య్యారాలు పోయిన
ఆ కిన్నెర చెంత ప‌లుకు ఏ విధంగా
ఉంటుంది?



భీమ్లా నాయ‌క్ పాట‌తో గొప్ప పేరు తెచ్చుకున్నారు కిన్నెర పాట‌ల గాయ‌కుడు మొగుల‌య్య.ఆయ‌న ప్ర‌తిభ‌ను చూసి అంతా ఫిదా అయిపోయారు.ప‌వ‌న్ సైతం ఆయ‌న‌ను తోచిన విధంగానే ఆదుకున్నారు.రెండు ల‌క్ష‌ల రూపాయ‌లు అందించి ఆ పేద క‌ళాకారుడి కి కొంత ఊర‌ట ఇచ్చారు.ఇదంతా బాగానే ఉంది కానీ ఆ రోజు తెలంగాణ ప్ర‌భుత్వం కూడా మొగుల‌య్య‌కు సాయం చేస్తామ‌ని ప్ర‌క‌టించింది.ఆ సాయం ఎందాక వ‌చ్చిందో తెలియ‌డం లేదు.తెలంగాణ‌లో ఒక్క మొగుల‌య్య అనే కాదు చాలా మంది కిన్నెర పాట‌ల క‌ళాకారులున్నారు క‌దా!మ‌రి! వాళ్లంద‌రికీ పింఛ‌ను అందుతుందా? అందినా వారి జీవ‌న గ‌తి బాగుందా? ఇవ‌న్నీ ఇవాళ తెలుసుకోవాలి.. ఒక్క‌సారి మ‌న‌నం చేసుకోవాలి...అంటూ రాశాను నేను పొంగిపోయాను నేను.


సినీ మాధ్య‌మంతో కాస్తో కూస్తో పేరు మ‌రియు వెలుగు వీరికి ద‌క్కి ఉండ‌వ‌చ్చు.కానీ అదే ప్రామాణికం కాదు క‌దా! క‌నుక మీరు మొగుల‌య్య‌నే కాదు అలాంటి క‌ళాకారులంద‌రికీ ఓ గొప్ప జీవితం అందించేందుకు పూనిక వ‌హించాలి.అందుకు ఈ ఏడాది ఆరంభం నాంది ప‌ల‌కాలి అని కోరుకుంటూ...ముగిస్తానిక..

- ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి
శ్రీ‌కాకుళం దారుల నుంచి...

 





మరింత సమాచారం తెలుసుకోండి: