సీనియర్ అగ్ర హీరో కమల్ హాసన్ తనయురాలిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన శృతి హాసన్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. టాలీవుడ్, కోలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ చిత్రాల్లోనూ నటించి ఆల్ రౌండర్ గా ప్రత్యేక గుర్తింపు పొందారు. టాలీవుడ్ లో మొదట్లో కాస్త కలిసి రాకపోయినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేసిన గబ్బర్ సింగ్ మూవీతో ఒక్క సారిగా అవకాశాలు వచ్చి వాలాయి. మళ్ళీ మద్యలో చేసిన చిత్రాలు నిరాశ మిగిల్చినా ఆ తరవాత రవితేజతో కలిసి చేసిన "క్రాక్" మూవీ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుని మళ్ళీ ఫుల్ బిజీ అయిపోయారు. త్వరలోనే "ఖిలాడీ" చిత్రంతో మన ముందుకు రానుంది ఈ అందాల భామ.

సినీ కెరీర్ పరంగా బాగానే ఉన్నా ఈమె లవ్ ట్రాక్  కూడా సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటుంది. ఆ మధ్య  లండన్ కు చెందిన మైఖేల్ తో ప్రేమ వ్యవహారం నడిపిన శృతి  తరచూ వార్తల్లో నిలిచారు. పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన శృతి హాసన్ మంచి మంచి అవకాశాలను మిస్స్ చేసుకున్నారని కెరియర్ ని చేతులారా నాశనం చేసుకుంటున్నారని వార్తలు దుమారం రేగాయి. అయితే ఏమయ్యిందో ఏమోగానీ ఈ మధ్య వారు కలిసి కనిపించింది లేదు వీరి మధ్య 2019 లోనే బ్రేక్ అప్ అయినట్లు వార్తలు వినిపించాయి...ఇపుడు ఇన్నాళ్ల తరవాత మరో వ్యక్తితో ముంబై వీదుల్లో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ తరచూ కెమెరా కళ్ళకు చిక్కుతోంది శృతి.

ఆ తర్వాత సంతను హజారికా తో రేలషన్ షిప్ లో ఉంది శృతి. ఇప్పుడిప్పుడే మళ్ళీ సక్సెస్ లు వరిస్తున్న వేళ మళ్ళీ ఇలా ప్రేమ వ్యవహారం తన కెరియర్ కి ఎక్కడ అడ్డుపడుతుందోనని ఆలోచనలో పడ్డారు శృతి హాసన్ ఫ్యాన్స్. ఇలా బాయ్ ఫ్రెండ్స్ ను మార్చుకుంటూ వెళ్ళడమేనా, పెళ్లి చేసుకునే ఆలోచన ఏమైనా ఉందా అని నెటిజన్లు అడుగుతున్నారు. ఆఖరికి ఈమె పెళ్లి విషయంలో తల్లితండ్రులు కూడా ఏమీ ఆలోచించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: