బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచి తన అందంతో ఆకట్టుకున్న ముద్దుగుమ్మ లహరి.అదృష్టం బాగోలేక ఈమె ప్రవర్తన యాటిట్యూడ్ ప్రేక్షకులకు నచ్చక త్వరగా ఎలిమినేట్ అయిన ఆమె అనూహ్యంగా తన అంద చందాలతో
నాగార్జున వద్ద మాత్రం మంచి పేరును దక్కించుకుంది.బిగ్ బాస్ షో తర్వాత ఇక ఆమెకు ఆఫర్లు వరుసగా వస్తున్నాయి. ఈ సమయంలోనే ఈమె బంగార్రాజు ప్రమోషన్ లో ఆమె భాగస్వామ్యం అయ్యింది. బంగార్రాజు ప్రమోషన్ లో భాగంగా
హీరో నాగ చైతన్య..
నాగార్జున ఇంకా కృతి శెట్టిలు ప్రైవేట్ జెట్ లో ప్రయాణించినట్లుగా అధికారికంగా బయటకు వచ్చింది. అయితే వారు ఎక్కడకు ప్రయాణించారు ఇంకా ఎలా వారి
ఈవెంట్స్ జరిగాయి అనే విషయాలను మాత్రం చూపించలేదు. ఈ సమయంలో
లహరి తన సోషల్
మీడియా అకౌంట్ లో తన కల నెరవేరింది అంటూ పోస్ట్ పెట్టింది..
నాగార్జున సర్ తో రోజంతా కూడా ప్రైవేట్ జెట్ లో ప్రయాణించే అవకాశం రావడం అదృష్టం అన్నట్లుగా ఓ ఫొటోను షేర్ చేసింది.

7
జనవరి 2021 లో తన కల నెరవేరిందని
లహరి పోస్ట్ పెట్టింది.ఇక అదే రోజున బంగార్రాజు టీమ్ మొత్తం కూడా ప్రైవేట్ జెట్ లో ప్రయాణం చేశారు. వారి ప్రయాణం ఎటు జరిగింది ఇంకా వారి ప్రయాణంలో
లహరి ఎందుకు తోడు అయ్యింది అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది.
లహరి సినిమాలో కీలక పాత్ర ఏమైనా పోషించిందా అంటే అదేం లేదని సమాచారం తెలుస్తుంది. అయినా కూడా
లహరి బంగార్రాజు ప్రమోషన్స్ లో భాగస్వామ్యం కావడానికి కారణం హోస్ట్ గా వ్యవహరించి ఉంటుంది అనేది ఒక వర్గం వారి నుంచి వస్తున్న టాక్. హోస్ట్ గానో లేదా గ్లామర్ కోసమో అయినా కూడా ఒక రోజంతా కూడా
నాగార్జున ఇంకా నాగచైతన్యలతో పాటు బంగార్రాజు టీమ్ తో గడపడమే చాలా గొప్ప విషయం అని చెప్పాలి.. అలాంటిది లహరికి ఏకంగా ప్రైవేట్ జెట్ లో వారితో కలిసి సరదాగా తిరిగే అవకాశం దక్కడం ఆమెకు చాలా పెద్ద విషయం.ఇక
బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 తో వచ్చిన గుర్తింపును సద్వినియోగం చేసుకునేందుకు
లహరి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది.