నటన పరంగా అమ్మోరు
అభినయం తో పాటు
అందం పరంగా కూడా
ఓ విధంగా శివాత్మిక
అమ్మోరు రూపమే!
సినిమాల్లో అమ్మోరులు ఉంటారు.. సినిమాలోనూ నిజ జీవితంలోనూ అమ్మోరులు ఎంతో మంది ఉన్నారు. కానీ కృష్ణ వంశీ దృష్టిలో మాత్రం హీరో రాజశేఖర్ కుమార్తె శివాత్మికనే అమ్మోరు.. ఆమె మాత్రమే తన సినిమాలో అనుకున్న క్యారెక్టర్-కు న్యాయం చేయగలదు అన్న నమ్మకంతో ఉన్నారు ఆయన.అదేవిధంగా ఈ సినిమాలో మరో ముఖ్యపాత్రను ప్రకాశ్ రాజ్ పోషిస్తుండడం, ఆయన నటనా వైశిష్ట్యంపై ఇప్పటికే ఎన్నోసార్లు ప్రశంసలు గుప్పించడం కూడా ఈ సందర్భంగా ప్రస్తావనార్హం.
చిర కాల స్నేహితుడు
ప్రకాశ్ తో ప్రయాణిస్తూ...
కొత్త ప్రపంచంలో
ఇళయరాజాతో పాటు
కృష్ణ వంశీ ఎలా ఉన్నారో?
రంగమార్తాండ సినిమాతో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.ఆయన మారథాన్ షూట్-ను చేస్తున్నారు ఈ సినిమా కోసం..ఇందుకు సంబంధించిన స్టిల్స్ కూడా ఎఫ్బీలో పోస్టు చేశారు. ఈ షూట్ లో శివాత్మిక పనితీరును, రాహుల్ సిప్లిగంజ్ పనితీరును ఎంతగానో మెచ్చుకున్నారు. శివాత్మికని అమ్మోరు అని వ్యవహరించారు. నట రాక్షసుడిగా ప్రకాశ్ రాజ్ ను అభివర్ణించి ఉండవచ్చు.. మల్టీ టాలెంటెడ్ పర్సన్ గా రాహుల్ ని ప్రశంసిస్తూ షూట్ అప్డేట్ ఇచ్చారు.