ప్రముఖ దర్శకుడు రాధాకృష్ణ డైరెక్షన్ లో పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న సినిమా రాధే శ్యామ్.. ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా..అందాల తార బుట్ట బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే..మొదటిసారి హై ఇంటెన్సివ్ లవ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఆశలను పెంచుకున్నారు. ఇక ఎట్టకేలకు జనవరి 14వ తేదీన సినిమాను విడుదల చేస్తామని అందుకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా చాలా ఘనంగా నిర్వహించారు.. అంతేకాదు సినిమాకు సంబంధించి పెద్ద ఎత్తున టీజర్ , ట్రైలర్ ను విడుదల చేసి సినిమాపై మరింత హైప్ ను క్రియేట్ చేశారు మేకర్స్..


ఇకపోతే ఈ సినిమా పాటలు ..టీజర్.. ట్రైలర్ అన్నీ చూసి ప్రేక్షకులు మరింత అంచనాలను పెట్టుకున్నారు.. కానీ సినిమా రిలీజ్ వాయిదా పడడానికి..కరోనా ఒక కారణమైతే.. సినీ ఇండస్ట్రీలో ఏపీ ప్రభుత్వం టికెట్ల రేట్లను తగ్గించడం ఇంకో కారణం అయింది. అందుకే ఈ రెండు కారణాల వల్ల కూడా సినిమాను రిలీజ్ చేయ లేక వాయిదా వేసుకున్నారు. ఇకపోతే నిన్నటికి నిన్న చిరంజీవి సీఎం జగన్ తో భేటీ అయి టికెట్ ల విషయంపై చర్చించగా సీఎం జగన్ సానుకూలంగా స్పందించినట్లు త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం కూడా లభిస్తుంది అని మీడియా వేదికగా అందరికీ వెల్లడించారు.

ఒక సమస్య సద్దుమణిగింది కాబట్టి ఈ సినిమాను రిలీజ్ చేస్తారని అందరూ ఎదురు చూడగా కానీ కరోనా తీవ్రత ఎక్కువ అవుతున్న తరుణంలో సినిమా మరో రెండు నెలలు వాయిదా వేశారు.. ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కొవిడ్ నియంత్రణలోకి వస్తే మార్చి 17 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేస్తామని అధికారికంగా ప్రకటించడం జరిగింది. కరోనా తగ్గకపోతే మళ్లీ ఈ తేదీని వాయిదా వేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇక ఏది ఏమైనా ప్రేక్షకులు ఈ సినిమా కోసం కరోనా తగ్గుముఖం పట్టాలని కోరుకుంటున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: