మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. దశరథ్ దర్శకత్వంలో మంచు మనోజ్ కుమార్ హీరోగా తెర‌కెక్కిన `శ్రీ‌` సిసిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ‌..`హ్యాపీడేస్` చిత్రంతో మంచి గుర్తింపును ద‌క్కించుకుంది. ఆ తరవాత తమన్నా కెరీర్ ప‌రంగా వెన‌క్కి తిరిగి చూసుకోలేదు. తెలుగుతో పాటు తమిళంలోనూ వ‌రుస సినిమాలు చేస్తూ స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కించుకుంది.

ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి ప‌దిహేనేళ్లు పూర్తైనా.. ఎంత మంది కొత్త హీరోయిన్లు వ‌స్తున్నా.. త‌న ఫామ్‌ను మాత్రం కోల్పోకుండా స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతోంది. ఇక ప్ర‌స్తుతం ఈమె తెలివిని చూసి.. సౌత్ హీరోయిన్స్ అంద‌రూ షివ‌ర్ అయిపోతున్నారు. వాస్త‌వానికి బాహుబ‌లి సినిమా త‌ర్వాత ఎఫ్ 2 మిన‌హా త‌మ‌న్నాకు అన్నీ ఫ్లాపులే ప‌డ్డాయి.

అయిన‌ప్ప‌టికీ ఆమె కెరీర్ డౌన్ అవ్వ‌లేదు. ఇంకా టాప్ హీరోయిన్స్‌లో ఒకరిగానే కొన‌సాగుతోంది. అలాగే వ‌రుస అవ‌కాశాలు అందుకుంటూ త‌న‌ను తాను బిజీగానే ఉంచుకుంటోంది. అయితే త‌మ‌న్నా సినిమాలు మాత్ర‌మే కాకుండా వెబ్ సిరీస్‌ల‌లో న‌టిస్తోంది. బుల్లితెరపై ఈ మ‌ధ్య హోస్ట్‌గా అవ‌తార‌మెత్తింది. అలాగే స్టార్ హీరోల సినిమాల్లో స్పెష‌ల్ సాంగ్స్ చేస్తూ ఐటెం భామ‌గా కుర్ర‌కారును అల్లాడిస్తోంది. ఇక ప‌లు బ్రాండ్స్‌కు ప్ర‌చార క‌ర్త‌గానూ వ్య‌వ‌హ‌రిస్తోంది.

ఇలా అదీ ఇదీ అని కాకుండా త‌న‌ను వెతుక్కుంటూ వచ్చిన ప్రతి అవకాశాన్నీ వినియోగించుకుంటూ రెండు చేతులా సంపాదిస్తోంది. మొత్తానికి తాను మామూలు దాన్ని కాద‌ని నిరూపించుకుంటున్న‌ త‌మ‌న్నా.. ప్ర‌స్తుతం అనిల్ రావిపూడి తెర‌కెక్కిస్తున్న `ఎఫ్ 3` చిత్రంలో న‌టిస్తోంది. విక్ట‌రీ వెంక‌టేష్, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ హీరోలుగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా స‌మ్మ‌ర్‌లో విడుద‌ల కానుంది. అలాగే త‌మ‌న్నా మ‌రోవైపు మెగాస్టార్ చిరంజీవికి జోడీగా `భోళా శంక‌ర్‌` చిత్రంలోనూ న‌టిస్తోంది. మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ కీల‌క పాత్ర‌ను పోషిస్తోంది. ప్ర‌స్తుతం ఈ రెండు చిత్రాలు సెట్స్ మీదే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: