తెలుగులో సూపర్ స్టార్ మహేష్ , డైరెక్టర్ కొరటాల శివ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఇప్పటివరకు వీరిద్దరి కలయికలో వచ్చిన ఏ సినిమా అయినా సరే మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ సారి హ్యాట్రిక్ సినిమా కోసం ఒక మంచి స్టోరి సిద్ధం చేశారట కొరటాల శివ.. ఇక ఇందులో హీరోగా మహేష్ బాబు ని ఎంచుకో బోతున్నారనే వార్త కూడా వినిపిస్తోంది. కొరటాల శివ-మహేష్ కాంబినేషన్లో శ్రీమంతుడు, భరత్ అనే నేను రాగ కలెక్షన్ల సునామి సృష్టించింది అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాలు సమాజంపై ఎంతో ప్రభావం చూపినది.. ఇక ఈ సినిమా నుండి కొంతమంది ప్రముఖులు సైతం తమకు తోచిన గ్రామాలను దత్తత తీసుకోవడం జరిగింది.

మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్లో సినిమా అంటే  కేరాఫ్ సక్సెస్ కు అడ్రస్ గా నిలిచింది.. ఇక ఈ మూవీ మహేష్ బాబు GMB ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించాలని మహేష్ బాబు కోరినట్లుగా సమాచారం. ఇక అంతే కాకుండా ఇందులో భాగంగా యువసుధ ఆర్ట్స్  బ్యానర్ ను కూడా భాగస్వామ్యం చేసుకోనున్నారట. అయితే ఈ విషయం నిజమో కాదో తెలియాలంటే.. చిత్ర బృందం నుంచి ఖచ్చితంగా ప్రకటన రావాల్సిందే. కొరటాల శివ రెండు సినిమాలు మహేష్ కి సక్సెస్ అందించినప్పటికీ.. మూడవ సినిమా అంటే మహేష్ అభిమానులు వ్యతిరేకిస్తున్నట్లు గా తెలుస్తోంది.. అందుకు కారణం ఏమిటంటే ఈ డైరెక్టర్ వల్లే తమ హీరో సైలెంట్ పాత్రలోనే పరిమితమయ్యారని కామెంట్లు చేయడం జరుగుతోంది.

అయితే ఇప్పుడిప్పుడే మహేష్ బాబు ఆ పాత్ర నుంచి బయటికి వచ్చి కాస్త మాస్ సినిమాలను చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇక ప్రస్తుతం మహేష్ బాబు వేరే సినిమా కమిట్మెంట్ లో ఉన్నారు.. కొరటాల శివ కూడా వేరే హీరోలతో సినిమాలో ప్లానింగ్ లో ఉన్నారు.. అంతే కాకుండా అల్లు అర్జున్ తో కూడా ఒక మూవీ ప్లాన్ ఉన్నట్లు సమాచారం. మరి మహేష్ బాబు తో ఎప్పుడు చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: