టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ వ్యక్తిగత జీవితంలో ఏం జరుగుతోంది అనేది ఇప్పుడు అందరిలో ఓ ప్రశ్న
మారింది. అందుకు ప్రధాన కారణం ఏంటంటే.. శ్రీజ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో తన పేరు చివర భర్త కళ్యాణ్ పేరును తీసేసింది. అయితే ఆమె తన పేరును 'శ్రీజ కళ్యాణ్' అని ఆమె సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో రాసుకోగా.. ప్రస్తుతం కళ్యాణ్'ను తొలగించి కేవలం శ్రీజ కొణిదెల అని మాత్రమే రాసుకొచ్చింది. ఇన్‌స్టాగ్రామ్ పేరు మార్చడంతో పలు సందేహాలకు దారి తీస్తున్నాయి.

అయితే గత సంవత్సరం నుండి కళ్యాణ్ దేవ్, శ్రీజ దంపతులు విడిపోతారనే వార్తలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఈ మధ్యకాలంలో మెగా ఫ్యామిలీ వేడుకల్లో కళ్యాణ్ దేవ్ కనిపించడం లేదంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక శ్రీజ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ కళ్యాణ్ దేవ్ ఓ ఫొటో పోస్ట్ పెట్టడంతో విడిపోతున్నారంటూ వస్తున్నా వార్తలకు చెక్ పడినట్లు అయ్యింది.

ఇక ఇప్పుడు ఆ పోస్ట్ గమనిస్తే.. ఆయన 'శ్రీజ కళ్యాణ్' ఇన్‌స్టా హ్యాండిల్ ట్యాగ్ చేశాడు. కానీ ఇప్పుడు ఆ పోస్టుపై క్లిక్ చేస్తే పేజ్ నాట్ అవైలబుల్ అంటుంది. అయితే శ్రీజ తన ఇన్‌స్టా హ్యాండిల్ చేంజ్ చేయడంతో ఆ ఫోటో రావడం లేదు. ఇక వీరిద్దరి ఇన్‌స్టా గ్రామ్ ఖాతల్లో లైఫ్ పార్ట్‌నర్‌తో దిగిన ఫొటోలు అలాగే ఉన్నాయి. ఇక ఇది నెటిజన్స్ కు ఉన్న సందేహాలు మాత్రమే అనుకోవాలి మరి. ఈ దంతపతులిద్దరూ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.. ఇక ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పెట్టవచ్చునని నెటిజన్స్ అంటున్నారు.

కాగా.. అందరికి సందేహాలు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే.. నాగచైతన్యతో విడాకులు తీసుకోవడానికి కొన్ని రోజుల ముందు సమంత కూడా ఇదే విధంగా సోషల్ మీడియాలో తన పేరును మార్చుకున్న విషయం అందరికి తెల్సిందే. అదే తరహాలో శ్రీజ కూడా చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అంతేకాదు.. కళ్యాణ్ దేవ్ హీరోగా నటించిన సూపర్ మచ్చి' సినిమా ప్రమోషన్స్‌లో మెగా ఫ్యామిలీలో ఎవరు పాల్గొనలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: