నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా టాలీవుడ్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అఖండ, ఈ  సినిమాలో అందాల ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించగా శ్రీకాంత్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించాడు, అలాగే మరో ముఖ్యమైన పాత్రలో పూర్ణ కూడా ఈ సినిమాలో నటించింది. ఈ సినిమా ప్రకటించినప్పటి నుండే ప్రేక్షకుల్లో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి, దానికి ప్రధాన కారణం బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో  ఇదివరకే సింహా, లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు రావడమే అందుకు ప్రధాన కారణం, అది మాత్రమే కాకుండా అఖండ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలకు కూడా అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా విడుదలకు ముందే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు పెంచింది,  అయితే అలా ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా పోయిన సంవత్సరం డిసెంబర్ 2 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల అయ్యింది.

 అయితే విడుదలైన మొదటి షో నుండే ఈ సినిమా బ్లాక్ బాస్టర్ టాక్ ను సొంతం చేసుకొని ప్రస్తుతం కూడా విజయవంతంగా థియేటర్ లలో ప్రదర్శించబడుతుంది, అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త  సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది, ఇప్పటికే వంద కోట్ల గ్రాస్ కలెక్షన్ లను సాధించిన ఈ సినిమా ప్రస్తుతం సంక్రాంతి కి కూడా పెద్ద  గా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా పోటీ లేకపోవడంతో అఖండ సినిమా ఇప్పటికి కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బాగానే కలెక్షన్ లను రాబడుతుంది. అయితే ఈ సినిమా  తాజాగా 150 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి,  అయితే ఈ సినిమా విడుదలై 50 రోజుల దగ్గరికి వస్తున్నా కూడా ఇంకా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ లను బాగానే రాబడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: